Site icon NTV Telugu

Bharat Jodo Yatra: “విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్”తో రాహుల్ గాంధీ మరోసారి..

Bhart Jodo Yatra

Bhart Jodo Yatra

Rahul Gandhi reunites with ‘Village Cooking Channel”: విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్” దీని గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. తమిళంలో ప్రారంభం అయిన ఈ యూట్యూబ్ ఛానెల్ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. కొంతమంది సభ్యులు అవుట్ డోర్ లొకేషన్లలో చేరే వంటకాలతో చాలా ఫేమస్ అయింది. 2018లో ప్రారంభం అయిన ఈ ఛానెల్ కు ఏకంగా 1.8 కోట్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. గతంలో ఓ సారి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో ఈ ఛానెల్ దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది.

గతేడాది జనవరిలో రాహుల్ గాంధీ తమిళనాడు పర్యటనలో భాగంగా విలేజ్ కుకింగ్ ఛానెల్ సభ్యులను కలుసుకున్నారు. ఆ సమయంలో వారితో వంట చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. వారు చేసిన వంటకాలను టేస్ట్ చేశారు. సాంప్రదాయ దక్షిణాది వంటకాలను వండుతూ వాటిని యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేస్తుంటారు. గతేడాది రాహుల్ గాంధీ ఈ కుకింగ్ ఛానెల్ సభ్యులను కలిసినప్పుడు.. రాహుల్ గాంధీ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారని ఛానెల్ నిర్వాహకులు తెగ సంబరపడిపోయారు. రాహుల్ గాంధీ కూడా మా వంటలో చేరారని.. ఈ వీడియో ‘ బిగ్ మూమెంట్’ పేరుతో అప్ లోడ్ చేశారు. ఆ సమయంలో రాహుల్ గాంధీ మష్రూమ్ బిర్యాణీని టేస్ట్ చేశారు.

Read Also: YS Sharmila: నా పోరాటంలో మరదలు కనిపించిందా.. నిరంజన్ రెడ్డికి కౌంటర్

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో’ యాత్ర తమిళనాడులో సాగుతోంది. శుక్రవారం మరోసారి విలేజ్ కుకింగ్ యూట్యూబ్ ఛానెల్ సభ్యులతో రాహుల్ మమేకం అయ్యారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో వారు కూడా పాల్గొన్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ ట్వీట్ చేసింది. భారత్ జోడో యాత్ర అన్ని సంస్కృతులను కలపడమే అని.. అది భాష కావచ్చు, వంటకాలు కావచ్చని.. విలేజ్ కుకింగ్ ఛానెల్ తో రాహుల్ గాంధీ మరోసారి కలిశారని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కన్యాకుమారి జిల్లాలో కొనసాగింది. శుక్రవారం నాగర్ కోయిల్ ప్రాంతం నుంచి రాహుల్ గాంధీ పర్యటన ప్రారంభం అయింది. దాదాపుగా 5 నెలల పాటు 3500 కిలోమీటర్ల పాటు పాదయాత్ర సాగనుంది.

Exit mobile version