NTV Telugu Site icon

Bharat Jodo Vivah: భారత్ జోడో వివాహం.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్స్

Bharath Hodo

Bharath Hodo

Bharat Jodo Vivah: భారత్ జోడో యాత్ర పేరుతో దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. ఈ భారత్ జోడో యాత్ర స్ఫూర్తిగా భారత్ జోడో వివాహం జరిగింది. భారత్ జోడో పోస్టర్ లా భారత్ జోడో వివాహ ఆహ్వాన పత్రికను ముద్రించింది ఓ యువ జంట. దీంతో ఈ వెడ్డింగ్ కార్డ్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే, కాంగ్రెస్ అగ్ర నాయకులను కూడా తమ వివాహానికి ఆహ్వానించారు. వధువు జమ్మూ మరియు బెంగాల్ కు చెందినది కాగా, పంజాబ్, కేరళకు చెందిన వరుడిని వివాహం చేసుకోబోతుంది. ఇక, సోషల్ మీడియాలో అభిలాష కొత్వాల్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.

Read Also: Electricity Demand: రికార్డ్ స్థాయిలో విద్యుత్ డిమాండ్: ఉప ముఖ్యమంత్రి

ఇక, తమ రాష్ట్రాలు, సంస్కృతులు వేరు అయినప్పటికీ భారతీయులను ఏకతాటిపైకి తీసుకురావడానికి ఉద్దేశించినదే ఈ పెళ్లి అని ఆ వారు చెప్పుకొచ్చారు. ‘భారత్ జోడో వివాహ్’ అనే శీర్షిక వారి ఐక్యత వెనుక ఉన్న లోతైన అర్థాన్ని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. దీనికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది.. చాలా ఏళ్ల క్రితం, అభిలాష తల్లి ప్రియాంక గాంధీ వివాహ ఆహ్వానాన్ని రూపొందించింది.. దానికి తోడు, రాహుల్, ప్రియాంక గాంధీల ఇంటికి వెళ్లి మరి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసింది. కాగా, ఈ పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీనిపై పలువురు నెటిజన్స్ హాస్యాస్పదంగా కామెంట్స్ చేయగా.. మరి కొందరు మాత్రం పెళ్లిళ్లను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమోషన్స్ కోసం వాడుకుంటుందని విమర్శలు గుప్పిస్తున్నారు.