NTV Telugu Site icon

Kavita Deeksha: ఢిల్లీ వేదికగా ఎమ్మెల్సీ కవిత భారత జాగృతి దీక్ష.. మహిళా బిల్ ప్రవేశపెట్టాలని డిమాండ్

Kavitha

Kavitha

Kavita Deeksha: మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలనే డిమాండ్‌తో నేడు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్ష చేపట్టనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఎమ్మెల్సీ కవితతోపాటు ఈ దీక్షలో 500 మంది కూర్చోనున్నారు. కాగా.. సాంకేతిక కారణాలతో అనుమతి రద్దు చేస్తున్నట్లు పోలీసులు కవితకు తెలియజేయడంతో జాగృతి సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. చర్చల అనంతరం పోలీసులు బీఆర్‌ఎస్‌ దీక్షకు ఓకే చెప్పారు. దీంతో ఇవాళ జంతర్ మంతర్ వద్ద యథావిధిగా కవితా దీక్ష జరగనుంది. ‘భారత జాగృతి’ తలపెట్టిన ఈ కార్యక్రమానికి ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో సహా దేశంలోని మొత్తం 18 రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి. దీక్షకు ఆయా పార్టీలకు చెందిన నేతలు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. కాగా..ఈ నేపథ్యంలో కవితకు మద్ధతుగా తెలంగాణ మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌లు ఢిల్లీకి చేరుకున్నారు.

ఈ దీక్ష వివరాలను గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కవిత వెల్లడిస్తూ.. కేంద్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. యూపీఏ హయాంలో సోనియాగాంధీ చొరవతో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పటికీ సంకీర్ణ ప్రభుత్వంలోని మిత్రపక్షాల సహకారం లేకుండా బిల్లు లోక్ సభ ఆమోదం పొందలేకపోయిందని అన్నారు. 2014లో, ఆ తర్వాత 2019లో బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా బిల్లును ప్రస్తావించిందని, రెండు ఎన్నికల్లోనూ సొంతంగా మెజారిటీ సాధించినా బిల్లును గాలికి వదిలేశారని అన్నారు.

ఆధార్ బిల్లును మనీ బిల్లుగా ఆమోదించిన ప్రభుత్వం మహిళా బిల్లును పూర్తిగా విస్మరించింది. భారతదేశంలో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలతో పోలిస్తే, పొరుగు దేశాలతో పోల్చినా, భారతదేశంలోనే తక్కువ ప్రాతినిధ్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేస్తే తప్ప ప్రాతినిధ్యం పెరగదని, అందుకే మహిళా బిల్లు కోసం పోరాటం ప్రారంభించామన్నారు. జంతర్ మంతర్ దీక్ష ప్రారంభం మాత్రమేనని, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందే వరకు తమ పోరాటాన్ని రోజురోజుకు ఉధృతం చేస్తామని ఆమె వెల్లడించారు.

జంతర్ మంతర్ దీక్షకు 18 రాజకీయ పార్టీలు సంఘీభావం తెలిపాయని, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన నాయకురాలు ప్రియాంక చతుర్వేది దీక్షను ప్రారంభిస్తారని, రాజన్న చేతుల మీదుగా దీక్ష చేపడతామని సీపీఐ కార్యదర్శి డి. కేవలం రాజకీయ పార్టీలే కాకుండా 18 రాష్ట్రాల నుంచి మహిళా హక్కుల కోసం పోరాడుతున్న సంస్థల ప్రతినిధులు హాజరవుతారని కవిత వెల్లడించారు. దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళల కోసం తాను చేస్తున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా సోనియాగాంధీని గానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరినైనా ఆహ్వానించారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘మేడమ్ సోనియా గాంధీ చాలా పెద్ద వ్యక్తి. నేను చిన్న ఎమ్మెల్సీని. లేని పక్షంలో సహాయం చేయాలని కాంగ్రెస్‌ను అభ్యర్థించాను. పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్‌కు లేఖ రాశాను. వారు కూడా హాజరవుతారని ఆశిస్తున్నాను” అని అన్నారు.

Show comments