Bharat Bandh: ఎస్సీ, ఎస్టీలకు ప్రస్తుతం కల్పిస్తున్న రిజర్వేషన్ కోటాలో మార్పులు చేస్తూ వర్గీకరణ చేసుకునేందుకు రాష్ట్రాలకు పర్మిషన్ ఇస్తూ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా ప్రకటించిన తీర్పుపై మాల సామాజిక వర్గం నిరసన వ్యక్తం చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఎస్సీ, ఎస్టీల్లో విభజన ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలో రిజర్వేషన్ల రక్షణ కోసం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఇవాళ (బుధవారం) భారత్ బంద్ కు పిలుపునిచ్చింది.
Read Also: Off The Record : అనలిస్టు అవతారమెత్తిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి..
కాగా, ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలని మాల సామాజిక వర్గాల నేతలతో పాటు రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్ కు పిలుపునిచ్చింది. అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించాలని సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించాలని కోరారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
Read Also: High Tension in Tadipatri: మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో తాడిపత్రిలో ఉద్రిక్తత!
అయితే, నేటి బంద్ లో అత్యవసర, అంబులెన్స్ సేవలు, వైద్య సేవలకు మినహాయింపు ఇస్తున్నట్లు బంద్ నిర్వాహకులు వెల్లడించారు. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, పాఠశాలలు, కళాశాలలు యథావిధిగా పని చేస్తాయని సర్కార్ చెప్పుకొచ్చింది. కాగా, ఈ భారత్ బంద్ పిలుపుతో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు ముందుగానే బంద్ కు మద్దతుగా మూసివేసేందుకు సిద్ధమవుతుండగా.. మరోవైపు, ఆందోళన చేసే మాల సామాజిక వర్గం నేతలను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు.