Bengaluru: జంతు ప్రేమికులు ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారో చూడాలి. ఉదయం వాకింగ్‌కు వెళ్లి వస్తున్న మహిళపై పెంపుడు కుక్క దాడి చేసి దారుణంగా గాయపరిచింది. ఈ ఘటన బెంగళూర్‌లోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో జనవరి 26న ఈ ఘటన జరగింది. ఉదయం 6.54 గంటల ప్రాంతంలో టీచర్స్ కాలనీలో, బాధితురాలి ఇంటి ముందే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
Read Also: Volkswagen Tera: “పోలో” వారసుడిగా వోక్స్ వ్యాగన్ టెరా..!
పోలీసుల కథనం ప్రకారం, అమరేష్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన కుక్క, అకస్మాత్తుగా మహిళపై దాడి చేసింది. ఆమె ముఖం, చేతులు, మెడ, కాళ్ల భాగాల్లో తీవ్రంగా కరిచింది. గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె ముఖం, మెడ ప్రాంతాల్లోని గాయాలకు 50కి పైగా కుట్లు వేసినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం, ఆమె పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
మహిళను రక్షించడానికి ప్రయత్నించిన వ్యక్తిపై కూడా కుక్క దాడి చేసి గాయపరిచింది. దాడి తర్వాత, మహిళ భర్త స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సంఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు. కుక్క యజమానిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చనే దానిపై చర్చిస్తున్నారు.
