Site icon NTV Telugu

Snake Bite: చెప్పులో దాక్కున్న పాము.. కాటేయడంతో టీసీఎస్ ఉద్యోగి మృతి..

Snake Bite

Snake Bite

Snake Bite: ఒక విషాదకరమైన సంఘటనలో 41 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శనివారం మరణించారు. తన పాదరక్షల్లో విషపూరితమైన పాము ఉందనే విషయం తెలియక, వాటిని వేసుకోవడంతో పాముకాటుకు గురయ్యాడు. దీంతో టీసీఎస్‌లో పనిచేస్తున్న మంజు ప్రకాష్ అనే వ్యక్తి మరణించారు. బాధితుడు ప్రకాష్ బెంగళూర్‌లోని రంగనాథ లేఅవుట్‌ నివాసి.

పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రకాష్ క్రాక్స్ చెప్పులను ఇంటి ముందు వదిలేసిన సమయంలో పాము అందులోకి దూరినట్లు తెలుస్తోంది. అతను ఈ విషయాన్ని గమనించకుండా పాము ఉన్న చెప్పులు ధరించి సమీపంలోని షాపు నుంచి జ్యూస్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. ఆ సమయంలోనే ఒక స్లిప్పర్‌లో దాక్కున్న పాము అతడిని కాటు వేసింది. దురదృష్టం ఏంటంటే, గతంలో ఒక యాక్సిడెంట్‌కి గురైన ప్రకాష్, తన కాలి స్పర్శను కోల్పోయాడు. అదే కాలును పాము కాటు వేసింది. దీంతో అతడికి పాము కరిచిన సంగతి తెలియలేదు.

Read Also: Donald Trump: భారత్‌తో సంబంధాలు ‘‘ఏకపక్ష విపత్తు’’.. భారత్‌పై ట్రంప్ అక్కసు..

విషయం తెలియని ప్రకాష్ ఇంట్లోకి వెళ్లి బెడ్‌పై విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, చెప్పులో చనిపోయిన పాము ఉందని గ్రహించిన బంధువులు, ఊపిరి ఆడకుండా మరణించినట్లు భావించారు. ప్రకాష్ తల్లి లోపలికి వెళ్లి చూసే సరికి, అతను బెడ్‌పై నోట్లో నుంచి నురగలు వచ్చి, కాలు నుంచి రక్తం కారుతున్న స్థితిలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన వర్షాకాలంలో చెప్పులు, షూలు క్షుణ్ణంగా తనికీ చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది. ఇళ్లలో రద్దీ ప్రదేశాలు, చీకటి మూలల్ని ఓ కంట కనిపెట్టాలని సూచిస్తోంది.

Exit mobile version