Bengaluru: డేటింగ్ యాప్ పేరుతో బురిడీ.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్
- డేటింగ్ యాప్ పేరుతో బురిడీ
- రూ.50 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తారన్న చందంగా బెంగళూరులో డేటింగ్ యాప్ పేరుతో ఓ మహిళ.. ఓ సాప్ట్వేర్ ఇంజనీర్‌ను నిలువునా ముంచేసింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా రూ.50 లక్షలు సమర్పించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
భాగస్వామిని వెతికే పనిలో భాగంగా డేటింగ్ యాప్‌లో శృతి మీనన్ అనే మహిళ ప్రొఫెల్‌ను చూశాడు. 2024, జూన్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ తర్వాత టెలిగ్రామ్, వాట్సప్‌లో క్యాజువల్ ఎక్స్ఛేంజీలు ప్రారంభమయ్యాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని మాటలు కుదిరాయి. అనంతరం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని ఆశచూపించింది. అలా స్టాక్ మార్కెట్‌తో పెద్ద బురిడీనే కొట్టించింది. ప్రారంభంలో 40,000 పెట్టుబడి పెడితే తిరిగి రూ.50,000 వచ్చాయి. దీంతో శృతి మరింత పెట్టుబడి పెట్టాలని కోరింది. దీనికి అతడు ప్లాట్ అయిపోయాడు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఆమె కోరిక మేరకు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత రాబడి బాగానే వచ్చింది. ఇక స్నేహితులను, బంధువులను అడిగి ఈసారి ఏకంగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. భారీ లాభాలు వస్తాయని ఆశించాడు. కానీ మోసపోయినట్లుగా అతడు గుర్తించారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. రూ.50లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 318 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మోసగాళ్లను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!