NTV Telugu Site icon

Bengaluru: డేటింగ్ యాప్ పేరుతో బురిడీ.. రూ.50 లక్షలు పోగొట్టుకున్న సాఫ్ట్‌వేర్

Scam

Scam

సమాజంలో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్లు పుట్టుకొస్తారన్న చందంగా బెంగళూరులో డేటింగ్ యాప్ పేరుతో ఓ మహిళ.. ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను నిలువునా ముంచేసింది. వందలు కాదు.. వేలు కాదు.. ఏకంగా రూ.50 లక్షలు సమర్పించుకున్నాడు. దీంతో బాధితుడు లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.

భాగస్వామిని వెతికే పనిలో భాగంగా డేటింగ్ యాప్‌లో శృ‌తి మీనన్ అనే మహిళ ప్రొఫెల్‌ను చూశాడు. 2024, జూన్‌లో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ తర్వాత టెలిగ్రామ్, వాట్సప్‌లో క్యాజువల్ ఎక్స్ఛేంజీలు ప్రారంభమయ్యాయి. త్వరలో పెళ్లి కూడా చేసుకుందామని మాటలు కుదిరాయి. అనంతరం స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే లాభాలొస్తాయని ఆశచూపించింది. అలా స్టాక్ మార్కెట్‌తో పెద్ద బురిడీనే కొట్టించింది. ప్రారంభంలో 40,000 పెట్టుబడి పెడితే తిరిగి రూ.50,000 వచ్చాయి. దీంతో శృతి మరింత పెట్టుబడి పెట్టాలని కోరింది. దీనికి అతడు ప్లాట్ అయిపోయాడు.

ఆమె కోరిక మేరకు రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత రాబడి బాగానే వచ్చింది. ఇక స్నేహితులను, బంధువులను అడిగి ఈసారి ఏకంగా రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. భారీ లాభాలు వస్తాయని ఆశించాడు. కానీ మోసపోయినట్లుగా అతడు గుర్తించారు. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. రూ.50లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భారతీయ న్యాయ సంహిత (BNS), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 318 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ వెనుక ఉన్న మోసగాళ్లను గుర్తించేందుకు విచారణ జరుపుతున్నారు.

Show comments