Bengaluru: భార్య, ఆమె కుటుంబం వేధింపులతో 34 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆయనకు న్యాయం జరగాలని సోషల్ మీడియా వేదిక నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. బెంగుళూర్‌లో సోమవారం ఆయన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనపై తప్పుడు నేరం మోపిందని, న్యాయవ్యవస్థ కూడా ఆమెకు సపోర్టు చేస్తుందని చెబుతూ ఆయన రాసిని సూసైడ్ లేఖ, రికార్డ్ వీడియో వైరల్ అవుతున్నాయి. తనతో పాటు తన ఫ్యామిలీపై కేసు పెట్టడంపై అతుల్ తీవ్ర వేదన చెందినట్లు తెలుస్తోంది. బీహార్‌కి చెందిన అతుల్, బెంగళూర్‌లో పనిచేస్తున్నాడు.జౌన్పూర్ కోర్టులో న్యాయమూర్తి కేసు సెటిల్మెంట్ కోసం రూ. 5 లక్షలు డిమాండ్ చేసిందని ఆరోపించారు. పురుషులపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఎత్తిచూపుతూ రాష్ట్రపతికి లేఖ రాశారు.
ఇదిలా ఉంటే, చనిపోయే ముందు రోజు వరకు అతుల్ అంతా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకుని ‘‘ చివరి రోజు ముందు రోజు’’, ‘‘చివరి రోజు’’, ‘‘చివరి క్షణం’’ అంటూ మూడు భాగాలుగా విభజించుకున్నాడు. తన ఫోన్ ఫింగర్ ఫ్రింట్, ఫేస్ రికగ్నైజేషన్‌ని తీసేశాడు. ఇతరులు తన ఫోన్ యాక్సెస్ చేసే విధంగా చేశాడు. తన కారు, బైక్ కీలు, గది తాళాలను ఫ్రిజ్‌పై ఉంచడంతో పాటు ఆఫీస్ పని అంతా పూర్తి చేసి, ఆఫీస్ ల్యాప్ టాప్, ఛార్జర్‌ని సమర్పించాలనే పనులని చెక్ లిస్టులో చేర్చాడు.
Read Also: Collectors Conference: రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్.. కీలక అంశాలపై ఫోకస్..
ఆర్థిక పరమైన విషయాలలతో పాటు, తన ఆఫీసు పనికి సంబంధించి డేటా బ్యాకప్ చేయడంతో పాటు వీడియో సూసైడ్ నోట్‌లను అప్‌లోడ్ చేయడం వంటి అంశాలు ఉన్నాయి. ‘‘లాస్ట్ మూమెంట్ అమలు’’ సెక్షన్‌లో స్నానం చేయాలని రాసుకున్నాడు. ఫ్రిజ్‌పై సూసైడ్ నోట్ పెట్టి వాటిపై కార్, బైక్, గది తాళాలు ఉంచాడు. అతుల్ సోదరుడు బికాస్ కుమార్ మాట్లాడుతూ.. తనకు చివరిగా వీడ్కోలు సందేశాలు పంపాడని, అతని కారు గూగుల్ మ్యాప్స్ లొకేషన్స్ పంచుకున్నాడని చెప్పారు. వీటిలో పాటు అతడి లాయర్లకు, కుటుంబ సబ్యులకు మెసేజులు పంపడం, హైకోర్టు-సుప్రీంకోర్టుకు మెయిల్ పంపండం వంటికి చెక్ లిస్టులో రాసుకున్నాడు.
వీటన్నింటిని నెల రోజులుగా అతుల్ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. “నేను నా కుటుంబం పట్ల పెండింగ్‌లో ఉన్న నా బాధ్యతలను పూర్తి చేయడానికి, నా పని కట్టుబాట్లు మొదలైనవాటిని పూర్తి చేయడానికి నాకు కొన్ని నెలలు పట్టింది. అలాగే చాలా ప్రభుత్వ కార్యాలయ పనులు నెమ్మదిగా ఉన్నాయి, ఇది ఆత్మహత్యకు ఈ ఆలస్యంకు దారితీసింది. ఈ ఆలస్యం నన్ను, నా కుటుంబాన్ని వేధించే వారికి, దోపిడీ చేసే వారికి సాయం చేయదు’’ అని ఆయన నోట్‌లో రాసుకున్నారు.
నేను ఎక్కువగా కష్టపడి పనిచేస్తే, నా పనిలో మరింత మెరుగైతే అది నా కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తుంది. మొత్తం న్యాయ వ్యవస్థ నన్ను వేధించేవారిని ప్రోత్సహిస్తుంది, సాయం చేస్తుంది. ఇప్పుడు నేను పోయిన తర్వాత డబ్బు ఉండు. ఇక నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రుల్ని, సోదరుడిని వేధించే వారు ఉండరు.’’ అని ఆవేదతో ఆయన చేసిన వ్యాఖ్యలు అందరితో కన్నీరు పెట్టిస్తున్నాయి. భార్యతో పాటు ఆమె తల్లి కూడా ‘‘నువ్వు ఇంకా ఎందుకు చావలేదు’’ అని అన్నారని అతుల్ వీడియోలో చెప్పారు. ప్రస్తుతం ఆయన భార్య, కుటుంబ సభ్యులపూ పోలీసులు కేసు నమోదు చేశారు.