Site icon NTV Telugu

Bengaluru: ‘‘నార్త్-ఇండియన్స్ వల్లే బెంగళూర్’’.. వివాదం అవుతున్న మహిళ కామెంట్స్..

Bengaluru

Bengaluru

Bengaluru: బెంగళూర్‌పై నార్త్ ఇండియా మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదస్పదమవుతున్నాయి. అయితే, ఆమెకు చాలా మంది మద్దతు లభించడం విశేషం. ఓ వీడియో క్లిప్‌లో తాను బెంగళూర్‌లో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలను తెలియజేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి మహిళ ఎదుర్కొన్న ‘‘కల్చరల్ షాక్’’ గురించి ప్రశ్నిస్తాడు. దీనికి మహిళ..‘‘నాకు కల్చరల్ షాక్ గురించి తెలియదు, కానీ ఇక్కడి ప్రజలు ఉత్తర భారతీయులను ద్వేషిస్తారు. అదే నేను గమనించాను’’ అని చెప్పింది.

నగరంలో చాలా మంది ఉత్తర భారతీయులను భిన్నంగా చూస్తారని, కొన్ని సార్లు ‘‘హిందీ ప్రజలు’’ అని సంబోధిస్తారని కూడా ఆమె ఆరోపించారు. ‘‘ఎవరైనా ఉత్తర భారతదేశానికి చెందిన వారు అని తెలిసినప్పుడు ప్రజలు మాతో భిన్నంగా ప్రవర్తిస్తారు. ఆలోవాలాలు మాపై ఎక్కువ ధరల్ని వసూలు చేస్తారు. మమ్మల్ని చాలా సార్లు హిందీ వాళ్లు అని సంబోధించడం విన్నాను’’ అని మహిళ చెప్పింది.

Read Also: Dil Raju : శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటా

‘‘నేను ఈ నగరాన్ని ఖచ్చితంగా ప్రేమిస్తాను. మళ్లీ సందర్శించాలని కోరుకుంటాను. కాని బయటి వ్యక్తుల్ని చూసినప్పుడు, ఇక్కడి మారు మీతో భిన్నంగా ప్రవర్తిస్తారు. బెంగళూర్ ఇప్పుడు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఉత్తర భారతీయులే. కానీ ప్రజలు దీనిని అంగీకరించడం కష్టం’’ అని ఆమె అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు 6,91,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. దాదాపుగా 5000 లైక్స్ వచ్చాయి. మహిళ వ్యాఖ్యలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె వ్యాఖ్యల్ని సమర్థిస్తుండగా, కొందరు మాత్రం తప్పుపడుతున్నారు. ‘‘ఆమె వ్యాఖ్యల్లో నేను తప్పు చూడటం లేదు. కన్నడిగులు కూడా దేశంలో వేరే ప్రాంతాలకు వెళ్తారు. ఉత్తరాది వారు ఇలాంటి ద్వేషం చూపించరు. వాళ్లకు హిందీ సరిగా మాట్లాడటం రాకున్న వారితో సర్దుకు పోతారు.’’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.

Exit mobile version