Site icon NTV Telugu

Bengaluru: జంట ఘాతుకం.. ఇంటి యజమానిని చంపి మంగళసూత్రంతో పరారీ

Bengaluru

Bengaluru

బెంగళూరులో ఓ జంట ఘాతుకానికి పాల్పడింది. ఇంటి యజమానిని చంపేసి మంగళసూత్రంతో పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జంటను గాలించి పట్టుకున్నారు.

శ్రీలక్ష్మీ అనే మహిళ.. బెంగళూరులోని ఉత్తరహళ్లిలోని న్యూ మిలీనియం స్కూల్ రోడ్డులో నివాసం ఉంటుంది. శ్రీలక్ష్మీ భర్త.. కాటన్‌పేట్‌లోని అగరుబత్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇక శ్రీలక్ష్మీ ఇంట్లో ప్రసాద్ శ్రీశైల్ మాకై, భార్య సాక్షి హనుమంత్ హోద్దూర్ అనే దంపతులు పని చేస్తున్నారు. శ్రీలక్ష్మీ భర్త మంగళవారం సాయంత్రం ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో ఇంటికొచ్చి చూడగా శ్రీలక్ష్మీ మృతదేహం కనిపించింది. మెడ, పెదవులు, ముఖంపై గాయాలు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. మెడలో మంగళసూత్రం కనిపించలేదు. పైగా ఇంట్లో పని చేస్తున్న భార్యాభర్తలు కూడా కనిపించకపోవడంతో అనుమానం చెలరేగింది. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి హత్యకు గురైనట్లుగా కనుగొన్నారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

శ్రీలక్ష్మీ భర్త ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. విచారించగా నేరాన్ని అంగీకరించారు. శ్రీలక్ష్మిని హత్య చేసి నగలను తీసుకుని పారిపోయినట్లు దంపతులు అంగీకరించారు. తదుపరి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Bihar Elections: కొనసాగుతున్న బీహార్ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు వీళ్లే..!

Exit mobile version