NTV Telugu Site icon

Husband’s gift to wife: చంద్రుడిపై ఎకరం భూమి.. భార్యకు భర్త పుట్టినరోజు కానుక..

Husband's Gift To Wife

Husband's Gift To Wife

Husband’s gift to wife: భార్యకు పెళ్లి మందు చేసి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు భర్త ఏకంగా చంద్రుడిపై భూమినే కొనుగోలు చేశాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఝర్‌గ్రామ్ జిల్లాకు చెందిన వ్యక్తి భార్య పుట్టిన రోజు చంద్రుడిపై భూమిని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఒక ఎకరం భూమిని రూ. 10,000లకు కొనుగోలు చేసిన సంజయ్ మహతో తన భార్యకు బహుమతిగా ఇచ్చాడు. పెళ్లికి ముందు తన భార్యకు చంద్రుడిని తీసుకువస్తానని హామీ ఇచ్చినందకు ఇలా చంద్రుడిని గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతం కావడంతో తాను చంద్రుడిపై భూమి కొనుగోలు చేయడానికి ప్రేరణ ఇచ్చిందని చెప్పాడు. నేను నా భార్య చాలా కాలంగా లవ్ చేసుకుని ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకున్నామని.. పెళ్లికి ముందు తనతో చందమామను తీసుకువస్తానని చెప్పానని, పెళ్లి తర్వాత తన పుట్టిన రోజున చంద్రుడిపై ఫ్లాట్ ను గిఫ్ట్ గా ఇచ్చానని మహతో చెప్పారు.

Read Also: Tomato Price: పూర్తిగా పతనమైన టమాటా ధర.. కిలో 30 పైసలే!

తన స్నేహితుడి సాయంతో లూనా సొసైటీ ఇంటర్నేషనల్ ద్వారా భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపాడు. మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపుగా ఏడాది పట్టిందని అతను చెప్పారు. భర్త మహతో ఇచ్చిన గిఫ్గుతో భార్య అనుమిక మురిసిపోతోంది. నిజానికి చంద్రుడిపై భూమి కొనుగోలు, ప్రైవేట్ ఓనర్ షిప్ సాధ్యం కాకపోయినప్పటికీ కొన్ని వెబ్‌సైట్స్ ఇలా చంద్రుడిపై భూమిని అమ్ముతూ సర్టిఫికేట్స్ ఇస్తుంటాయి. అంతకుముందు 2020లో రాజస్థాన్ అజ్మీర్ కి చెందిన ఒక వ్యక్తి మ్యారేజ్ డే సందర్భంగా తన భార్యకు చంద్రుడిపై 3 ఎకరాల భూమిని గిఫ్గ్ గా ఇచ్చాడు. ధర్మేంద్ర అనిజా అనే వ్యక్తి తన భార్య సప్నా అనిజాకు గిఫ్ట్ ఇచ్చాడు.

Show comments