Mamata Benerjee: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీపై ఈడీ విచారణ కొనసాగుతుండగా.. ఇప్పటివరకు ఆ విషయంపై స్పందించని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు మౌనం వీడారు. తాను అవినీతికి మద్దతు ఇవ్వనని తేల్చి చెప్పారు. అవినీతికి మద్దతివ్వనన్న మమత.. పార్లమెంట్ నుంచి రూ.లక్ష పింఛన్, రాష్ట్ర ఎమ్మెల్యేగా రూ.2 లక్షల జీతం.. ఇప్పటివరకు తాను 11 ఏళ్లలో ఎంత డబ్బు సంపాదించానో లెక్కించాలని ఆమె అన్నారు. ఇది కాకుండా ఒక్క పైసా కూడా తీసుకోలేదని మమత బెనర్జీ స్పష్టం చేశారు. తన సేవ స్వచ్ఛందమని ఆమె పేర్కొన్నారు. గత రెండు రోజులుగా ఒక రాజకీయ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై తాను విచారంగానూ, నిరుత్సాహంగానూ ఉన్నానని పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ అన్నారు.
సుభాష్ చంద్రబోస్ రాసిన “రైట్ టు మేక్ బ్లండర్స్” పుస్తకాన్ని ప్రస్తావిస్తూ, “ప్రజలు తప్పులు చేస్తారు.. తప్పులు చేయడం కూడా హక్కు. ఎవరైనా తప్పుడు కార్యకలాపాలకు పాల్పడితే, వారు ఎంత కఠినమైన తీర్పు వచ్చినా మనలో ఎవరూ జోక్యం చేసుకోరు. మేము వారికి మద్దతు ఇవ్వము.” అంటూ పరోక్షంగా వెల్లడించారు.
ఈ కేసును ‘స్త్రీకి సంబంధించిన సంఘటన’గా పేర్కొంటూ.. తాను మహిళలను గౌరవిస్తాను కానీ అందరూ మంచివారు కాదు. నిజం బయటకు రావాలని కోరుకుంటున్నానన్నారు. నిర్ణీత గడువులోగా.. ఎవరైనా నిజాన్ని బట్టి తీర్పు ఇవ్వాలన్నారు. దోషిగా తేలితే వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినా తనకు అభ్యంతరం లేదన్నారు. పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసిన తర్వాత సీపీఐ(ఎం), బీజేపీ తనపై చేస్తున్న ద్వేషపూరిత ప్రచారాన్ని మమత ఖండించారు. విచారణ సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బుతో తన ఎందుకు ట్యాగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, సీపీఎంలు అలా చేస్తున్నాయని మండిపడ్డారు. తాను రాజకీయాల్లోకి రాకపోతే వారు దుస్సాహసానికి వారి నాలుకను కోసేసేదాన్ని అంటూ ధ్వజమెత్తారు.
AIIMS : పార్థ ఛటర్జీ ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు.. ఆయన బాగానే ఉన్నారు..
ఉపాధ్యాయ నియామకాల కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై బెంగాల్ పరిశ్రమల మంత్రి పార్థ ఛటర్జీని శనివారం అరెస్టు చేశారు .రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది అక్రమ నియామకాల్లో ఆయన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి.అయితే కుటుంబ సభ్యులకు గానీ, సంబంధీకులకు గానీ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో ఎవరికి ఫోన్ చేయాలని ఈడీ అధికారులు అడగడంతో ఆయన సీఎం మమతకు అని సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన అర్ధరాత్రి 2.31 గంలకు, 2.33 గంటలకు, 3.37 గంటలకు, ఉదయం 9.35 గంటలకు దీదీకి ఫోన్ చేశారు. అయినప్పటికీ ఆ కాల్‌కు ఆమె సమాధానం ఇవ్వలేదు. అయినా చటర్జీ మరో మూడుసార్లు దీదీకి ఫోన్ చేసినప్పటికీ ఆమె లిఫ్ట్ చేయలేదు. మరో నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అనే సమాధానం రావడంతో.. చేసేదేమిలేక ఆయన ఈడీ అధికారుల వెంట నడిచారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయాన్ని ఖండించింది. మమతకు ఎలాంటి కాల్స్ రాలేదని పేర్కొంది.
Partha Chatterjee: కుక్కల కోసం ఖరీదైన ఫ్లాట్.. ఈడీ విచారణలో షాకింగ్ విషయాలు
ఈ కుంభకోణంపై ఈడీ దర్యాప్తులో భాగంగా ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. శుక్రవారం ముఖర్జీ నివాసం నుంచి దాదాపు రూ.20 కోట్ల భారీ నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ ఆమెను అరెస్టు చేసింది.