NTV Telugu Site icon

Bangladesh: మన్మోహన్ సింగ్‌కి బంగ్లా దేశాధినేత యూనస్ నివాళి..

Bangladesh

Bangladesh

Bangladesh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ నివాళి అర్పించారు. భారత్‌కి రెండుసార్లు ప్రధానిగా చేసిన, భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరుతెచ్చుకున్న మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో మరణించారు. మంగళవారం ఢాకాలోని భారత హైకమిషన్‌లో యూనస్, మన్మోహన్ సింగ్‌కి నివాళులు తెలియజేశారు. ‘‘ఎంతో సాదాసీదాగా ఉండేవారు, చాలా తెలివైనవారు’’ అని యూనస్, మన్మోహన్ సింగ్‌తో తనకున్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. భారతదేశాన్ని గ్లోబల్ దిగ్గజంగా మార్చడంతో ఆయన అతిపెద్ద పాత్ర పోషించారని కొనియాడారు.

Read Also: May 2024 Movie Roundup: పద్మవిభూషణ్ చిరంజీవి.. అల్లు అర్జున్ కు సత్కారం

మంగళవారం ఉదయం ఢాకాలోని బరిధరాలోని హైకమిషన్ కార్యాలయంలోకి యూనస్‌ని భారత హైకమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ రిసీవ్ చేసుకున్నారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి యూనస్ నివాళులు అర్పించారు. హైకమిషన్‌లోని సంతాప పుస్తకంలో సందేశం రాశారు.

మన్మోహన్ సింగ్ 2004-14 వరకు రెండుసార్లు ప్రధానిగా పనిచేశారు. 1991లో అప్పటి పీవీ నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘటన మన్మోహన్ సింగ్‌కి దక్కుతుంది. క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న భారత్‌ని సరళీకరణ మార్గం వైపు నడిపించారు. ప్రస్తుతం దేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు మన్మోహన్ దూరదృష్టి సహకరించింది.

Show comments