Baker Writes Woman Delivery Instruction On Cake In Mumbai: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేవారిలో కొందరు రెస్టారెంట్ లేదా డెలివరీ బాయ్‌లని ఉద్దేశించి డెలివరీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. అంటే.. మసాలా తగ్గించండి అని రెస్టారెంట్లకి, వచ్చేటప్పుడు రూ.500కి చిల్లర తీసుకురమ్మని డెలివరీ బాయ్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ముంబైకి చెందిన వైష్ణవి అనే అమ్మాయి కూడా అలాంటి ఇన్‌స్ట్రక్షనే ఇచ్చింది. పుట్టినరోజు కోసం ఒక కేక్ ఆర్డర్ పెట్టిన ఆమె.. నేరుగా ఆన్‌లైన్‌లో అందుకు బిల్లు కట్టకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకుంది.
దీంతో, వచ్చేటప్పుడు రూ. 500కి చిల్లర తీసుకురమ్మని బాయ్‌కి ఇన్‌స్ట్రక్షన్ పెట్టింది. కానీ, ఈ ఇన్‌స్ట్రక్షన్‌కి సదరు రెస్టారెంట్ మరోలా అర్థం చేసుకుంది. ఆ అక్షరాలు (Bring 500/- Change) కేక్ మీద రాయాలేమో అనుకొని, ఉన్నది ఉన్నట్టుగా కేక్ మీద రాసి పంపించారు. తీరా ఇంటికొచ్చిన తర్వాత కేక్ చూసి, వైష్ణవి ఖంగుతింది. హ్యాపీ బర్త్‌డేకి బదులు Bring 500/- Change ఉండటం చూసి అవాక్కయ్యింది. దీన్ని సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయగా.. అది చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. సరదా వ్యాఖ్యలు చేస్తూ.. నెట్టింట్లో ఆ ఫోటోని షేర్ చేస్తున్నారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే మరొకటి నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. కపిల్ అనే వ్యక్తి నగరంలోనే పేరొందిన ఓ రెస్టారెంట్ నుంచి కేక్ ఆర్డర్ చేశాడు. అందులో డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ కింద.. ‘ఇందులో ఎగ్ ఉందన్న విషయాన్ని తెలియజేయండి’ అని పెట్టాడు. కానీ, ఆ రెస్టారెంట్ ఏం చేసిందో తెలుసా? ఇది ఎగ్‌తో చేసిన కేక్ అని ఆ కేక్ మీద రాసింది. దాన్ని చూసిన తర్వాత తనకు నోట మాట రాలేదంటూ కపిల్ తన అనుభవాన్ని ట్విటర్‌లో షేర్ చేసుకున్నాడు. ఇందుకు కూడా విచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి.
