Site icon NTV Telugu

Supreme Court: జువెనైల్‌ బెయిల్‌‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supremecourt

Supremecourt

క్రిమినల్ కేసుల్లో బాలనేరస్తులకు బెయిల్ నిరాకరించొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర నేరస్థుడితో నైతిక, శారీరక సంబంధం, మానసికంగా ప్రమాదం ఉందని తేలితే తప్ప.. వారికి బెయిల్‌ నిరాకరించవద్దని స్పష్టం చేసింది. మైనర్‌పై లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన ఓ పిటిషన్‌ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ విధంగా వ్యాఖ్యానించింది.

ఇది కూడా చదవండి: Congress: జమ్మూకాశ్మీర్ పీసీసీ చీఫ్‌గా తారిఖ్ హమీద్ కర్రా నియామకం

రాజస్థాన్‌లో ఓ మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన బాలుడు ఏడాదిగా కస్టడీలోనే ఉన్నాడు. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం విచారించింది. ఈ కేసులో బెయిల్‌ నిరాకరిస్తూ రాజస్థాన్‌ హైకోర్టు, జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ ఇచ్చిన ఆదేశాలను సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది. జువెనైల్‌ను ఎటువంటి జామీను లేకుండానే బెయిల్‌పై వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. ఒకవేళ బెయిల్‌కు నిరాకరించాల్సి వస్తే.. అందుకు గల కారణాలను జువెనైల్‌ బోర్డు రికార్డు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Vinesh Phogat: రిటైర్మెంట్ పై వినేశ్ ఫోగట్ యూటర్న్..!

Exit mobile version