Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!

Badrinath Highway Tragedy

Badrinath Highway Tragedy

Badrinath Highway Tragedy: ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హరిద్వార్ నుంచి జోషిమఠ్‌కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 13 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. హరిద్వార్ నుంచి జోషిమఠ్‌కు వెళ్తున్న విశ్వనాథ్ సేవా సంస్థకు చెందిన బస్సు రిషికేశ్ సమీపంలోని గూలర్ ప్రాంతం వద్ద ప్రమాదానికి గురైంది.

అదుపుతప్పిన బస్సు రహదారి పక్కన ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 32 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. గూలర్ సమీపంలో బస్సు అదుపుతప్పి రైలింగ్‌ను బద్దలుకొట్టి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 13 మంది గాయపడ్డారు. మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.