2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరాఖండ్‌లో ఇప్పటికే కీలక రాజకీయ మార్పులు జరిగాయి… ఇప్పుడు.. ఆ రాష్ట్ర గవర్నర్ బేబీ రాణి మౌర్య తన పదవికి రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్ గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు కాగా.. మరో రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉండగానే బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది.. బేబీ రాణి మౌర్య.. రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపినట్టు రాజ్‌భవన్ అధికారి తెలిపారు.. అయితే, ఆమె వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్టు చెప్పుకొచ్చాడు. 2018 ఆగస్టు 26న ఉత్తరాఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమె.. పదవికాలం మిగిలుండగానే రాజీనామా చేయడం కొత్త చర్చకు తావిస్తోంది.
అయితే, ఉత్తరాఖండ్‌లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనే రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ కూడా ఒకటిగా ఉంది.. మరోవైపు.. తక్కువ కాలంలో అక్కడ ఇద్దరు సీఎంలను మార్చేసింది బీజేపీ అధిష్టానం.. మరోసారి ఉత్తరాఖండ్‌లో విజయం సాధించడానికే సీఎంలను మార్చారనే చర్చ జరగగా.. ఇప్పుడు గవర్నర్ రాజీనామాలో కూడా రాజకీయ కారణాలను వెతుకున్నారు విశ్లేషకులు.
