ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ముంబై ఉలిక్కిపడింది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో పోలీసులు కీలక నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తు్న్నారు. ఇక తాజా విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బాబా సిద్దిఖీ కుమారుడు, ఎమ్మెల్యే జీషన్ సిద్దిఖీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ హిట్‌లిస్ట్‌లో ఉన్నట్లు విచారణలో తేలింది. తండ్రి, కుమారులను చంపేందుకు కాంట్రాక్టు ఇచ్చినట్లు షూటర్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి: Ghatikachalam: భయపెట్టేలా ఘటికాచలం టీజర్
హత్య జరిగిన ప్రాంతంలోనే సిద్దిఖీ, ఆయన కుమారుడు ఉంటారని షూటర్స్ భావించి వచ్చినట్లు తెలిసింది. ఒకేచోట తండ్రి, కొడుకును చంపడానికి వచ్చారు. వీలులేకపోతే ఎవరు దొరికితే వారిని హత్య చేయాలని చెప్పినట్లు దర్యాప్తులో వెల్లడించారు. జీషన్ సిద్దిఖీ కాంగ్రెస్ టికెట్‌పై వంద్రే ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికలో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలతో పార్టీ ఆయన్ను బహిష్కరించింది.
ఇది కూడా చదవండి: Heavy Rains: అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు హెచ్చరిక
బాబా సిద్దిఖీపై ముగ్గురు దుండగులు ఆరు రౌండ్లు కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఆయనపై కాల్పులు జరుపుతున్న సమయంలో నవరాత్రి ఊరేగింపులో బాణసంచా కాలుస్తుండటంతో కాల్పుల శబ్దం బయటకు వినిపించలేదు. సిద్దిఖీని తామే చంపామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హత్య జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. మరోవైపు బాలీవుడ్ నటులతో కూడా సిద్దిఖీకి మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు కూడా భారీ భద్రత పెంచారు.
ఇది కూడా చదవండి: Lawrence Bishnoi Gang: 700 మంది షూటర్లు.. 11 రాష్ట్రాల్లో నెట్‌వర్క్.. మరో దావూద్ ఇబ్రహీం!