Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రద్దీ దృష్ట్యా ఆలయ ట్రస్టు భక్తుల కోసం హారతి, దర్శనానికి వేళల్లో మార్పులు చేసింది. కొత్త సమయాలను పంచుకుంది. రామ మందిరం వద్దనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది.
Read Also: Bank Holidays : ఫిబ్రవరి లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసా?
కొత్త వేళలు ఇవే:
ఉదయం 4:30 గంటలకు రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ ఆరతి (ప్రార్థన), ఉదయం 6:30 గంటలకు మంగళ ప్రార్థన జరుగుతుంది. ఉదయం ప్రార్థన అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం భోగ్ (నైవేద్యం) ప్రార్థన, సాయంత్రం 7:30 గంటలకు సాయంత్రం హారతి నిర్వహించబడుతుంది, సాయంత్రం నైవేద్య ప్రార్థన రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఆరోజు చివరి ప్రార్థన అయిన శయన హారతి రాత్రి 10 గంటలకు జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ అధికార ప్రతినిధి, మీడియా ఇన్‌ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు.
జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని ప్రముఖులు అతిథులుగా వచ్చిన ఈ కార్యక్రమంలో రామ్ లల్లా ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ తర్వాత రోజు నుంచి సాధారణ భక్తుల దర్శనానికి అనుమతించారు. అప్పటి నుంచి దేశంలోని నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు వస్తున్నారు.