అయోధ్య రామ మందిర ట్రస్ట్ సీఈఓగా టైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియమితులయ్యారు. 5,000 మందికి పైగా అభ్యర్థుల నుంచి జితేంద్ర మిశ్రాను ఈ పదవికి ఎంపిక చేశారు. భారత వాయుసేనలో జితేంద్ర మిశ్రా కీలక బాధ్యతలు నిర్వహించారు. పలు కమాండింగ్ హోదాల్లో పనిచేసిన ఆయన.. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వాయుసేన పశ్చిమ కమాండ్ చీఫ్‌గా వ్యవహరించారు.

