Site icon NTV Telugu

అగ్ని ప్రైమ్ మిస్సైల్ ప‌రీక్ష విజయవంతం

అగ్ని ప్రైమ్ క్షిప‌ణిని ఇవాళ విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఒడిశాలోని బాలాసోర్ వ‌ద్ద ఈ మిస్సైల్‌ను ప‌రీక్షించిన‌ట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అగ్ని-పీ మిస్సైల్ కొత్త జ‌న‌రేష‌న్‌కు చెందిన అడ్వాన్స్‌డ్ వేరియంట్. అగ్ని ప్రైమ్ క్యానిస్ట‌ర్ మిస్సైల్‌. దీని సామ‌ర్థ్యం 1000 నుంచి 2000 కిలోమీట‌ర్ల దూరం. అగ్ని ప్రైమ్‌కు అణ్వాయుధాలు మోసుకువెళ్లే సామ‌ర్థ్యం ఉందని తెలిపారు.

Read Also: చెన్నై-బెంగళూరు హైవేను దిగ్భంధించిన మహిళా కార్మికులు

అగ్ని క్లాస్‌కు చెందిన ఈ మిస్సైల్‌లో అనేక కొత్త ఫీచ‌ర్ల‌ను జోడించారు. అత్యంత కచ్చితత్వంతో మిష‌న్ ల‌క్ష్యాల‌ను చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతేకాకుండా దీంట్లో అధునాతన ఆధునిక సాంకేతికతను వినియోగించారు. దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం సైనికులను ఆయుధాలను సమకూర్చే లక్ష్యంతో వివిధ క్షిపణీ పరీక్షలను నిర్వహిస్తుంది. ఇప్పటికే బాలిస్టిక్‌, అగ్ని, పృథ్వీ క్షిపణీ వ్యవస్థలతో పాటు ఇవి కూడా చేరడంతో భారత్‌ రక్షణ వ్యవస్థ మరింతగా బలపడుతుందని అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version