Uttar Pradesh: గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడు మృతి.. జైలులో ఉన్న అన్నను కలిసేందుకు వెళ్తూ..
- అతిక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి.
- జైలులో ఉన్న అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తుండగా ప్రమాదం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దివంగత అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మరణించాడు. జైలులో ఉన్న తన అన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అబాన్ అహ్మద్‌తో పాటు మరో నలుగురు హ్యుందాయ్ క్రేటా వాహనంలో ప్రయాణిస్తుండగా, ఝాన్సీ సమీపంలో కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది, కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో అబాన్‌తో పాటు మరొకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
వీరంతా ప్రయాగ్‌రాజ్ నుంచి ఝాన్సీ వెళ్తున్నారు. జిల్లా జైలులో ఉన్న అలీ అహ్మద్‌ను కలిసేందుకు వెళ్తున్నారని పోలీసులు తెలిపారు. అలీ అహ్మద్ 2025 అక్టోబర్ 1న నైనీ సెంట్రల్ జైలు నుంచి ఝాన్సీ జిల్లా జైలుకు తరలించారు. అలీ అహ్మద్‌పై అక్రమ వసూళ్ల కేసుతో పాటు 2023లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితుడనే ఆరోపణలు ఉన్నాయి. 2023లో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్‌ను జైలు నుంచి వైద్య పరీక్షల కోసం తీసుకువస్తున్న సమయంలో అతడితో పాటు అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను జర్నలిస్టుల ముసుగులో వచ్చిన వ్యక్తులు కాల్చి చంపారు.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!