NTV Telugu Site icon

Love Jihad: “లవ్ జిహాద్‌”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..

Himanta

Himanta

Love Jihad: బాల్య వివాహాలు, బహుభార్యత్వం వంటి వాటిపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో ఇలాంటి వాటికి వ్యతిరేకంగా చట్టాలు తీసుకువచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ఎక్కువ అవుతున్న ముస్లిం వలసదారులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. వారి కబ్జాలో ఉన్న భూములను తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన ‘‘లవ్ జిహాద్’’ గురించి మాట్లాడుతూ.. ఇలాంటి కేసుల్లో జీవితఖైదు విధించేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు.

Read Also: Nadendla Manohar: గృహ నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డ ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..లవ్ జిహాద్ కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అస్సాంలో పుట్టిన వారికి మాత్రే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులని చెప్పారు. త్వరలోనే కొత్త డొమిసైల్ పాలసీని తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం, లక్ష ఉద్యోగాల్లో స్థానికతకు ప్రాధాన్యత లభించిందని అన్నారు. హిందువులు, ముస్లింల మధ్య భూముల విక్రయానికి సంబంధించి అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఇలాంటి లావాదేవీలను నిరోధించలేనప్పటికీ ముందుకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి సమ్మతి తీసుకోవడం తప్పనిసరి చేస్తామని హిమంత చెప్పారు.