NTV Telugu Site icon

Govt Jobs: 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీ.. పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడి

Govt Jobs

Govt Jobs

Govt Jobs: కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9.79లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. 2021, మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా.. వాటిలో దాదాపు పది లక్షలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఈ మేరకు బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

Sonia Gandhi: నేడు ఈడీ ముందుకు సోనియాగాంధీ.. దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

కేంద్ర ప్రభుత్వంలో మొత్తం 40,35,203 ఉద్యోగాలు మంజూరు కాగా.. వాటిలో 30.55 లక్షల మంది విధుల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. పదవీ విరమణ, ప్రమోషన్లు, రాజీనామాలు, మరణాలు వంటి కారణాలతో ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతూనే ఉంటాయని చెప్పారు. ఖాళీలు ఏర్పడటం, వాటి భర్తీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని చెప్పారు. ఈ క్రమంలో కొత్త ఉద్యోగాల సృష్టి, వాటిని నియామకాలను పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని.. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు. ఇటువంటి ఖాళీలను సాధ్యమైనంత వేగంగా భర్తీ చేయాలని ఆయా విభాగాలకు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామన్నారు. ఇదిలా ఉండగా, ఏడాదిన్నర కాలంలో కేంద్రప్రభుత్వ శాఖల్లో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించారు.

Show comments