NTV Telugu Site icon

Tamil Nadu: ఆర్మీ జవాన్ భార్యపై 40 మంది దాడి.. అసభ్య ప్రవర్తన

Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడులో దారుణం జరిగింది. తనపై 40 మందికి పైగా దాడి చేసి, అసభ్యంగా ప్రర్తించారని, అసభ్య పదజాలంతో దూషించారని ఓ ఆర్మీ జవాన్ భార్య ఆదివారం ఆరోపించారు. ఈ ఘటన వేలూరులో జరిగింది. తనను అనుచితంగా తాకినట్లు ఆమె పేర్కొన్నారు. మా కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వమని, బెదిరిస్తున్నట్లు బాధిత మహిళ ఆరోపించారు. శనివారం తనను అర్ధనగ్నంగా చేసి కొట్టారని ఆమె ఆరోపించారు.

Read Also: Bandi Sanjay: నోరు జారిన బండి సంజయ్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్

జవాన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తిరువన్నామలై ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులు రాము, హరిప్రసాద్ లను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఒక సివిల్ తగాదా కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఒక సివిల్ తగాదా వల్ల దాడి జరిగనట్లు తెలుస్తోందని ఎస్పీ వెల్లడించారు. ఈ ఘటనపై బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై స్పందించారు. ఆర్మీ జవాన్ భార్యపై దాడి చేసి వేధింపులకు పాల్పడినవారిపై నిష్పక్షపాత దర్యాప్తుతో న్యాయం చేయాలని అన్నారు.