Site icon NTV Telugu

Upendra Dwivedi: నేడు శ్రీనగర్, ఉదంపూర్‌లో ఆర్మీ చీఫ్ పర్యటన

Army

Army

ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రీనగర్, ఉధంపూర్‌లో పర్యటించనున్నారు. కాశ్మీర్ లోయలో మోహరించిన సీనియర్ ఆర్మీ కమాండర్లతో పాటు ఇతర భద్రతా సంస్థల అధికారులను కలవనున్నారు. లోయలో కొనసాగుతున్న భద్రతా పరిస్థితిని, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పరిస్థితులను సమీక్షించనున్నారు. ఈ మేరకు రక్షణ అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: బైసరన్‌ లోయపై కేంద్రం సంచలన ప్రకటన.. ఆ విషయమే తెలియదని వెల్లడి

ఇక లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడిలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భద్రతా అధికారులు అప్రమత్తం అయ్యారు. మంగళవారం పహల్గామ్‌లో జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. పదుల కొద్దీ గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం బాధితులు కోలుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Pahalgam Attack: ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన భద్రతా దళాలు..

Exit mobile version