ఎయిరిండియా విమాన సంస్థపై ప్రముఖ సితార్ వాయిద్య కళాకారిణి అనౌష్క శంకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో ప్రయాణించేటప్పుడు తన సితార్ విరిపోయిందని.. దీనికి ఎయిరిండియానే కారణమంటూ తీవ్ర కోపాన్ని వ్యక్తం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బాబ్రీ మసీదు ప్రతిపాదన తెచ్చిన ఎమ్మెల్యేపై మమత ఆగ్రహం!
అనౌష్క శంకర్.. ప్రముఖ దివంగత సితార్ విధ్వంసుడు పండిట్ రవిశంకర్ కుమార్తె. ఇటీవల అనౌష్క శంకర్ ఎయిరిండియాలో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా సితార్ విరిగిపోయింది. తాను సితార్ వాయిస్తున్నప్పుడు శృతి తప్పిందని.. చూస్తే కింద విరిగిపోవడం చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. 15-17 ఏళ్ల కాలంలో వాయిద్యానికి ఇలా జరగడం ఇదే తొలిసారి అన్నారు. ఎయిరిండియా సిబ్బంది కారణంగానే ఇలా జరిగిందని ఆమె ఆరోపించారు. వీడియోలో సితార్ విరిగిపోయిన దృశ్యాలు చూపించారు. నిర్లక్ష్యంగా.. ఉద్దేశపూర్వకంగా ఇలా చేయకపోతే ఎందుకు జరుగుతుందని ఎయిరిండియాను నిలదీశారు. అయినా చాలా కాలం తర్వాత ఎయిరిండియాలో ప్రయాణం చేశానని.. ఒక భారతీయ పరికరం పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి? అని కడిగిపారేశారు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi: రూపాయి విలువ పడిపోతే నన్నెందుకు అడుగుతున్నారు.. వాళ్లను అడగండి.. ప్రియాంకాగాంధీ రుసరుసలు
ప్రస్తుతం వీడియో వైరల్ కావడంతో అభిమానులు, తోటి కళాకారులు ఎయిరిండియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఎయిరిండియాను డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే అనౌష్క శంకర్ గ్రామీ అవార్డుకు ఎన్నికయ్యారు. సంగీతంలో అత్యుత్తమ ప్రతిభ కనుబరిచిన వారికి యూనైటెడ్ స్టేట్స్ రికార్డింగ్ అకాడమీ ఈ అవార్డులు అందిస్తుంది. 2026 ఫిబ్రవరి 1న ఆదివారం లాస్ ఏంజిల్స్‌లోని క్రిప్టో.కామ్ అరీనాలో వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలో అనౌష్క శంకర్ అవార్డు అందుకోనున్నారు.
