NTV Telugu Site icon

క‌రోనాతో మ‌రో ఎమ్మెల్యే మృతి

Leho Ram Boro

క‌రోనా మ‌హ‌మ్మారి ఎప్పుడు ఎక్క‌డి నుంచి ఎలా ఎవ‌రిపై ఎటాక్ చేస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి.. అందుకే లాక్‌డౌన్ విధించి మ‌రి.. ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని చెబుతున్నాయి ప్ర‌భుత్వం.. అయినా.. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 1.5 ల‌క్ష‌ల మందికి పైగానే కోవిడ్ బారిన ప‌డుతున్నారు.. మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది.. ఎంతోమంది వీఐపీల‌ను సైతం ట‌చ్ చేసిన క‌రోనా.. అందులో కొంద‌రి ప్రాణాలు కూడా తీసింది.. తాజాగా, మ‌రో ఎమ్మెల్యే క‌రోనాతో క‌న్నుమూశారు. అసోంలోని యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబ‌ర‌ల్ (యూపీపీఎల్‌)కు చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్యే లెహోరామ్ బోరో.. ఇవాళ క‌రోనాతో మ‌ర‌ణించారు. ఆయ‌న వ‌య‌స్సు 63 ఏళ్లు… ఇటీవ‌లే ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా తేల‌గా.. గువాహ‌టిలోని మెడిక‌ల్ కాలేజ్ అండ్ ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నారు.. అయితే, ఇవాళ ఉద‌యం ఆయ‌నకు గుండెపోటు రావ‌డంతో ప్రాణాలు వ‌దిలారు. ఆయ‌న మృతికి అసోం గ‌వ‌ర్న‌ర్, సీఎం, మంత్రులు, ప‌లువురు ఎమ్మెల్యేలు, పొలిటిక‌ల్ లీడ‌ర్లు సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా, త‌ముల్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి కొత్త‌గా ఎన్నికైన ఎమ్మెల్యే లెహోరామ్ బోరో.. గ‌త కొంత‌కాలం క్రితం మ‌రో ఎమ్మెల్యే కూడా క‌రోనాతో మృతిచెందారు.. దీంతో.. అసోంలో క‌రోనాతో మృతిచెందిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు చేరింది.