Site icon NTV Telugu

Anand Mahindra: మరోసారి ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Anand Mahindra

Anand Mahindra

Anand Mahindra: ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహీంద్రా సంస్థల చైర్మన్ గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎన్నో ఆసక్తికరమైన ట్వీట్లు చేస్తూ నెటిజన్లకు అందుబాటులో ఉంటారు. ఇన్స్‌పిరేషనల్, మోటివేషనల్, ఫన్నీ ట్వీట్లు చేస్తుంటారు. నెటిజెన్లు చేసే పలు ట్వీట్లకు కూడా స్పందిస్తుంటారు. అందుకే ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ హ్యాండిల్ కు 10.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

Read Also: Nani: దసరా సినిమాకి కష్టాలు తప్పేలా లేవు… ఈ గండం నాని ఎలా దాటుతాడో ఏమో?

తాజాగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. భారతదేశంలోని నదుల ప్రాముఖ్యత, నీటి సంరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో భారతదేశంలోని 51 నదుల పేర్లలో ఉన్న వీడియో సాంగ్ ను షేర్ చేశారు. ‘‘రివర్స్ ఆఫ్ ఇండియా’’ సాంగ్ ను నెటిజన్లతో పంచుకున్నారు. ‘‘భారతదేశంలోని 51 నదుల పేర్లపై ఆధారపడిన అద్భుతమైన పాట. ఈ విలువైన వనరుపై అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. బాంబే జయశ్రీ ( ఆమె కుమారుడు అమృత్) కౌశికి చక్రవర్తి ఆమె కుమారుడు, రిషిత్) మరియు అనేక ఇతర వ్యక్తులతో కలిసి రూపొందించారు. సంగీతాన్ని నదిలా ప్రవహించనివ్వండి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడం’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.

బాంబే జయశ్రీ, కౌషికి చక్రవర్తి, రిషిత్ దేశికన్, అమృత్ రామ్‌నాథ్‌లు నటించిన ఈ పాటను 2021లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ షేర్ చేసింది. నాగరికతకు, మనిషి జీవనవిధానానికి పట్టుకొమ్మగా ఉన్న నదుల గొప్పతనాన్ని తెలియజేస్తూ, భారతదేశంలోని అన్ని నదుల పేర్లలో ఈ పాటను రూపొందించారు. నీటి వనరులను పరిరక్షించడం, రక్షించాల్సిన అవసరాన్ని చెబుతూ ఐఐటీ మద్రాస్ అవగాహన కల్పించేందుకు దీన్ని నిర్మించింది. దీనిపై స్పందించిన నెటిజన్లు అద్భుతమై పాటని, నదులు మానవుకు జీవితాన్ని శ్రేయస్సును ఇస్తాయని, వాటిని సంరక్షించుకోవాలని రెస్పాండ్ అవుతున్నారు.

Exit mobile version