Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul milk: దేశవ్యాప్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. ప్రముఖ డెయిరీ దిగ్గజం ‘అముల్’ పాల ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 మేర ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (GCMMF) ప్రకటించింది. ఈ పెరిగిన ధరలు మే 14 (గురువారం) నుంచి అమల్లోకి రానున్నాయి.
పెరిగిన అముల్ పాల ధరల వివరాలు (కొత్త ధరలు):
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
అముల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్): అర లీటర్ (500ml) ప్యాకెట్ ధర రూ.35 , లీటర్ ధర రూ.70కి చేరింది.
అముల్ తాజా (టోన్డ్ మిల్క్): అర లీటర్ ధర రూ.30, లీటర్ ధర రూ.58గా నిర్ణయించారు.
అముల్ ఆవు పాలు: 500ml ప్యాకెట్ ఇప్పుడు రూ.31కి లభిస్తుంది.
అముల్ గేదె పాలు: అర లీటర్ ప్యాకెట్ ధర రూ.38కి పెరిగింది.
ధరల పెంపునకు కారణాలు ఇవే..
ప్రధానంగా పశువుల మేత ధరలు గణనీయంగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అముల్ వెల్లడించింది. మేతతో పాటు ప్యాకేజింగ్ ఖర్చులు, రవాణా (ఇంధన) వ్యయం కూడా పెరగడంతో.. పాల ఉత్పత్తి చేసే రైతులు, డెయిరీలపై భారం పడకుండా ఉండేందుకు ఈ స్వల్ప పెంపు చేపట్టినట్లు సంస్థ తెలిపింది. తాజా పెంపు వల్ల లీటరుపై దాదాపు 2.5 శాతం నుంచి 3.5 శాతం వరకు భారం పడనుంది. పాల ధరల పెంపుతో వినియోగదారులపై భారం పడినప్పటికీ, రైతులకు ఇచ్చే కొనుగోలు ధరను కూడా అముల్ పెంచింది. కిలో కొవ్వుకు ఇచ్చే ధరను రూ.30 మేర పెంచినట్లు సంస్థ తెలిపింది. ఇది గతేడాది మే (2025) నాటి ధరలతో పోలిస్తే 3.7 శాతం ఎక్కువ. కాగా అముల్ చివరిసారిగా 2025, మే 1వ తేదీన ధరలను పెంచింది. సరిగ్గా ఏడాది తర్వాత మళ్లీ అదే సమయంలో ధరల పెంపు జరగడం గమనార్హం. అముల్ బాటలోనే ఇతర ప్రైవేట్, సహకార డెయిరీ సంస్థలు కూడా ధరలను పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?