Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా

  • దీదీ ఇంటికెళ్లబోతున్నారు
  • మోడీ నాయకత్వానికి ఓటర్లు మద్దతు తెలిపారు
  • మే 4న బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న అమిత్ షా
Amitshah

Amitshah

దీదీ ఇంటికెళ్లబోతున్నారని మమతా బెనర్జీని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రెండో దశ ఎన్నికల ప్రాచారంలో భాగంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. 152 స్థానాలకు తొలి దశలో జరిగిన ఎన్నికల్లో 110 స్థానాలను బీజేపీ గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో దీదీ ఇంటికెళ్లడం ఖాయమని జ్యోసం చెప్పారు. భారీగా నమోదైన పోలింగ్ శాతం బీజేపీ కలిసొస్తుందని తెలిపారు. మొదటి దశ ఎన్నికల్లో ఓటర్లు మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెల్పారన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గురువారం 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 92.88 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా లెక్కలొచ్చాయి. గత ఎన్నికల కంటే 10 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎలక్షన్ ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ‘‘సర్’’పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అర్హుల ఓట్లు తొలగించారంటూ టీఎంసీ ఆరోపించింది. అయితే ఈసారి పోలింగ్ కోసం కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం దింపింది. దీంతో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. పైగా కొత్త ఓటర్లు నూతనోత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. ఇక ఓటు వేయకపోతే ఓటు తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కారణంతో కూడా ఓటర్లు సునామీలా దూసుకొచ్చి ఓటేశారు. రెండో దశలో 142 స్థానాలకు గాను ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.