Amit shah: ‘‘దీదీ ఇంటికెళ్తున్నారు’’.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న అమిత్ షా
- దీదీ ఇంటికెళ్లబోతున్నారు
- మోడీ నాయకత్వానికి ఓటర్లు మద్దతు తెలిపారు
- మే 4న బీజేపీ అధికారంలోకి రాబోతుందన్న అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దీదీ ఇంటికెళ్లబోతున్నారని మమతా బెనర్జీని ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రెండో దశ ఎన్నికల ప్రాచారంలో భాగంగా అమిత్ షా మీడియాతో మాట్లాడారు. 152 స్థానాలకు తొలి దశలో జరిగిన ఎన్నికల్లో 110 స్థానాలను బీజేపీ గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో దీదీ ఇంటికెళ్లడం ఖాయమని జ్యోసం చెప్పారు. భారీగా నమోదైన పోలింగ్ శాతం బీజేపీ కలిసొస్తుందని తెలిపారు. మొదటి దశ ఎన్నికల్లో ఓటర్లు మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెల్పారన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. గురువారం 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. దాదాపు 92.88 శాతం ఓటింగ్ నమోదైనట్లుగా లెక్కలొచ్చాయి. గత ఎన్నికల కంటే 10 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎలక్షన్ ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ‘‘సర్’’పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అర్హుల ఓట్లు తొలగించారంటూ టీఎంసీ ఆరోపించింది. అయితే ఈసారి పోలింగ్ కోసం కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం దింపింది. దీంతో ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి పోలింగ్‌లో పాల్గొన్నారు. పైగా కొత్త ఓటర్లు నూతనోత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేశారు. ఇక ఓటు వేయకపోతే ఓటు తొలగిస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ కారణంతో కూడా ఓటర్లు సునామీలా దూసుకొచ్చి ఓటేశారు. రెండో దశలో 142 స్థానాలకు గాను ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
#WATCH | Kolkata: Union Home Minister Amit Shah says, "In the feedback we have received, the people of Bengal have decided their future at the first phase… 92.98% voting done on the 52 seats in the 16 districts meant that Didi is about go and BJP is set to come, fear is about… pic.twitter.com/CrPUSLFCoP
— ANI (@ANI) April 24, 2026
#WATCH | Kolkata: Union Home Minister Amit Shah says, "In the 2016 elections, 1,278 people were injured. In the 2021 elections, 1,681 people were injured. In the 2023 panchayat elections, 664 people were injured. And in the 2024 general elections, 761 people were injured. In… pic.twitter.com/XpDeEZU2du
— ANI (@ANI) April 24, 2026
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!