Ambedkar row: రాజ్యసభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘‘అంబేద్కర్’’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్ష కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇదిలా ఉంటే, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే శనివారం అమిత్ షాపై పదునైన విమర్శలు చేశారు. ఆయనను ‘‘పిచ్చి కుక్క’’ కరిచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Read Also: Allu Arjun: నాకు థియేటర్లోకి పోలీసులే దారి క్లియర్ చేశారు…అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు
కర్ణాటక ఐటీ మంత్రి ఖర్గే మాట్లాడుతూ.. ‘‘ ఏడు జన్మల్లో భగవంతుడి నామాన్ని జపిస్తే స్వర్గంలో స్థానం లభిస్తుందో లేదో నాకు తెలియదు. కానీ, ఈ జన్మలో అంబేద్కర్ నామాన్ని జపించడం ద్వారా రాజకీయ, సామాజిక, ఆర్థిక సమానత్వం, ఆత్మగౌరవం పొందుతాము’’ అని అన్నారు. అంబేద్కర్, సమానత్వం ఆయన ఆలోచనల్లో లేకపోవడమే అసలైన సమస్య అని అమిత్ షాని ఉద్దేశించి అన్నారు. అంబేద్కర్, బసవ తత్వాలు ఎంతగా పెరిగితే ఆర్ఎస్ఎస్ భావజాలం అంతగా తగ్గిపోతుందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.
రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇప్పుడు ప్రతిపక్షాలు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది, ఇంతలా దేవుడు పేరు తలుచుకుంటే వారికి స్వర్గంలో చోటు లభించి ఉండేది అని అన్నారు. ఈ వ్యాఖ్యలే మొత్తం వివాదానికి కారణమైంది. అయితే, ఈ స్పీచ్‌లోని కొంత భాగాన్ని కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ నేతలు షేర్ చేసుకున్నారు. అయితే, తన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తుందని అమిత్ షా ఆరోపించారు.