Site icon NTV Telugu

Punjab : ఓటమి అంగీకరిస్తూ.. ప్రజలను అభినందించిన మాజీ సీఎం

Punjab Former CM Amarinder Singh agree his Defeat in Punjab Assembly Elections 2022.

దేశంలో 5 రాష్ర్టాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. అయితే బీజేపీ అభ్యర్థులు పంజాబ్‌ మినహా మిగితా 4 రాష్ట్రాల్లో ముందంజలో ఉన్నారు. అయితే పంజాబ్‌లో మాత్రం ఆప్‌ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ కాంగ్రెస్‌ను వీడి కొత్త పార్టీ పెట్టడం.. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆయన పాటియాల అర్బన్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. దీంతో ఆయన ఆప్‌ అభ్యర్థి అజిత్‌ పాల్‌ సింగ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు.

దీంతో తన ఓటమిని ఆయనే స్వయంగా అంగీకరించారు. అంతిమంగా ప్రజాస్వామ్యమే గెలిచిందంటూ కామెంట్ చేశారు. పంజాబ్ లో అధికారంలోకి రాబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పంజాబ్ ప్రజలు నిజమైన ఆదర్శం చూపించారని, కులాలు, వర్గాలకు అతీతంగా ఓటేసి తామేంటో నిరూపించారని కొనియాడారు. భగవంత్ మన్ కు ఆయన అభినందనలు తెలిపారు.

Exit mobile version