NTV Telugu Site icon

JoSAA Counselling: జూన్‌ 30న జోసా మొదటి విడత సీట్ల కేటాయింపు.. 25న మాక్‌ సీట్ల కేటాయింపు

Josaa

Josaa

JoSAA Counselling: దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీ, ప్రభుత్వ సహకారంతో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా) మొదటి విడత సీట్ల కేటాయింపును జూన్‌ 30న ప్రకటించనుంది. ఇందుకు సంబంధించిన మాక్‌ సీట్ల కేటాయింపును ఈ నెల 25న ప్రకటిస్తుంది. ఇందుకు సంబంధించిన మాక్‌ సీట్ల కేటాయింపు వివరాలను జోసా విడుదల చేసింది.

Read also: Bhanu Sree Hot Pics: గ్లామర్ డోస్ పెంచేసిన భాను శ్రీ.. హాట్ అందాలతో కవ్విచేస్తోందిగా!

JoSAA 2023 కౌన్సెలింగ్ మాక్ సీట్ల కేటాయింపు జాబితా జూన్ 25న విడుదల చేయనుంది. అభ్యర్థులు josaa.nic.inలో జాబితాను చూసుకోవాలని సూచించింది. జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ జూన్ 25న JoSAA 2023 కౌన్సెలింగ్ మాక్ సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తుంది. కౌన్సెలింగ్ రౌండ్‌లో పాల్గొనేవారు జోసా అధికారిక వెబ్‌సైట్ josaa.nicలో మాక్ సీట్ల కేటాయింపు జాబితాను చూసుకోవచ్చు. కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం రెండవ మాక్ సీట్ కేటాయింపు జాబితాను జూన్ 27న అందుబాటులో ఉంచుతారు. JoSAA కౌన్సెలింగ్‌లో నమోదు చేసుకోవడానికి జూన్ 28 తుది గడువు. డేటా సరిచేసుకోవడానికి, వెరిఫికేషన్ మరియు కేటాయించిన సీట్ల ధ్రువీకరణ జూన్ 29న జరుగుతుంది. మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు జాబితాను ఈ నెల 30న విడుదల చేయనున్నారు.

Read also: Devara: నాలుగు నెలల్లో నాలుగు భారీ షెడ్యూల్స్ కంప్లీట్…

దేశంలోని ఐఐటీల్లోని ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాయింట్‌ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌(జేఈఈ) మెయిన్‌-2023ని రెండు విడతల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు విడతల్లో సుమారు 15 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో సుమారు 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్ డ్‌-2023కి అవకాశమిచ్చారు. జేఈఈ అడ్వాన్స్ డ్‌కు 1.83 లక్షల మంది హాజరయ్యారు. అందులో సుమారు 43వేల మందిని అర్హులుగా ప్రకటించారు. 43 వేల మంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరడానికి జోసా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వరా సీట్ల కేటాయింపును జోసా చేయనుంది.