C-295 Military Aircraft: ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం సంయుక్తంగా టాటా ఎయిర్‌క్రాఫ్ట్‌ని ప్రారంభించారు. గుజరాత్ వడోదరలోని టాటా ఫెసిటిలీలో 40 సైనిక వ్యూహాత్మక రవాణా విమానాలైన C-295 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిర్మించనున్నారు. ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది.
C-295 ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు:
C-295 ఎయిర్‌క్రాఫ్ట్ వైమానిక దళానికి ఎంతో కీలకమైనది. ఈ విమానాలకు 5-10 టన్నుల సామర్థ్యం ఉంటుంది. C-295 అనేది 71 మంది సైనికులు లేదా 50 మంది పారాట్రూపర్‌ల వ్యూహాత్మక రవాణాకు సరిపోతుంది. భారీ లాజిస్టిక్ ఆపరేషన్ల కోసం, సరైన సదుపాయాలు లేని చోట్ల కూడా ఈ విమానం అత్యున్నతంగా పనిచేస్తుంది. ఈ విమానం 260 నాట్ల వేగంగతో ప్రయాణించగలదు. చిన్న ఎయిర్‌స్ట్రిప్స్‌లో కూడా పనిచేస్తుంది. చదునుగా లేని, ఇసుక, గడ్డి ఉన్న ఎయిర్ స్ట్రిప్స్‌లో కూడా ఇది ల్యాండ్ కాగలదు.
ఏకంగా 11 గంటల పాటు ప్రయాణించగలదు. ఆల్ వెదర్స్‌లో కూడా ఈ విమానం విజయవంతంగా పనిచేయగలదు. షార్ట్ టేకాఫ్/ల్యాండ్ కాగలదు. ఇది 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. సెప్టెంబరు 2026లో వడోదరలోని టాటా-ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ నుండి మొదటి C-295 విమానం తయారు కావచ్చు. మిగిలిన 39 విమానాలు ఆగస్టు 2031 నాటికి డెలివరీ చేయబడుతాయి. టాటాలతో పాటు, భారత్ ఎలక్ట్రానిక్స్ మరియు భారత్ డైనమిక్స్ వంటి ప్రముఖ డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, అలాగే ప్రైవేట్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థలు ఈ కార్యక్రమానికి సహకరిస్తాయి.