Akhilesh Yadav Controversial Comments On Ganga Vilas: ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ను ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే! దీనిపై తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నౌక కొత్తదేమీ కాదని, ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూనే ఉందని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు అందులో మద్యం అందుబాటులో ఒక బార్‌ని కొత్తగా తెచ్చారని ఆరోపణలు చేశారు. పాతవాటిని మళ్లీ కొత్తగా ప్రారంభించే సంప్రదాయం బీజేపీకే చెల్లిందని కౌంటర్ వేశారు. అందులో బార్ ఉందో? లేదో? అనే విషయంపై బీజేపీనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
RRR: ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అవార్డ్.. తొలి భారతీయ సినిమాగా..
రాయ్‌బరేలీలో మీడియాతో అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఆ గంగా విలాస్ గత 17 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఈ విషయాన్ని నాకు కొందరు తెలియజేశారు. దానికి కేవలం కొన్ని మార్పులు మాత్రమే చేసి.. ఏదో కొత్త నౌకను లాంచ్ చేసినట్టు దాన్ని మేము ప్రారంభించామని బీజేపీ వాళ్లు ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి ప్రచారాలు చేసుకోవడం, అబద్ధాలు చెప్పుకోవడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది. మరో దారుణమైన విషయం ఏమిటంటే.. ఎంతో పవిత్రమైన గంగా నదీలో ప్రయాణించే ఆ నౌకలో ఇప్పుడు మద్యం అందించే బార్లు కూడా ఉన్నట్లు నాకు సమాచారం అందింది. ఇప్పటివరకు గంగాలో హారతి మాత్రమే ఇస్తారని మనం వినేవాళ్లం. మరి ఆ నౌకలో బార్ ఉందో లేదో బీజేపీ వాళ్లే స్పష్టం చేయాలి’’ అని వ్యాఖ్యానించారు.
Bala Murugan : రచయిత బాలమురుగన్ కన్నుమూత
కాగా.. ఎన్నో అధునాతన సౌకర్యాలతో నిర్మితమైన ఈ గంగా విలాస్ వారణాసిలోని గంగా హారతితో మొదలై బిహార్‌లోని విక్రమశిల యూనివర్సిటీ, పశ్చిమబెంగాల్‌లోని సుందర్బన్ డెల్టా, అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కు సహా పలు ప్రపంచ వారసత్వ ప్రాంతాలను చుట్టుముట్టి అస్సాంలోని దిబ్రుగార్‌కి చేరుకుంటుంది. 51 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో భాగంగా ఈ నౌక 3200 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఇందులో ఒక్కొక్కరికి రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే.. ఇందులో కేవలం 36 మంది పర్యాటకులు మాత్రమే ప్రయాణించే వీలుంది. ఆల్రెడీ ఈ నౌకా ప్రయాణానికి 2024 ఏప్రిల్ వరకు బుకింగ్‌లు పూర్తయ్యాయి.
