NTV Telugu Site icon

Software Murder: బెంగళూరు యువతి హత్యకేసులో ట్విస్ట్.. మైయిన్ క్యారెక్టర్ లవరే

Software Murder

Software Murder

Software Murder: బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి దారుణ హత్యలో సంచల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రియుడే తనను గొంతునుమిలి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించాడు. ప్రియుడే ఆమెను అతి కిరాతకంగా హత్య చేయడమే కాకుడా.. ఆమె ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ఫ్యాన్‌ కు ఉరివేసి అక్కడి నుంచి పరారయినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కొన్ని గంటల్లోనే ఈ హత్య లవరే చేసినట్లు గుర్తించారు. కుటుంబం ఇచ్చిన ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు లవరే ఇదంతా చేసి ఏమీ తెలియనట్లు ఆత్మహత్యగా చిత్రీకరించాడని తెలిపారు.

Read also: Bihar: జైల్లో ఉన్న భర్త ముఖాన్ని చూసి గర్భవతి మృతి

రాజస్థాన్‌కు చెదిన ఓ వ్యాపారి కొన్నేళ్ల క్రితం గోదావరిఖని ప్రాంతానికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. ఆయన కూతురు ఆకాంక్ష బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. అక్కడే జీవన్ భీమా నగర్ పరిధిలోని కోడిహళ్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటుంది. ఆకాంక్ష పని చేస్తున్న కంపెనీలోనే అర్పిత్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత ఐదు సంవత్సరాలుగా వీరిమధ్య ప్రేమాయణం కొనసాగుతుంది. అయితే గత కొద్ది రోజులుగా ఇద్దరు మధ్య తరుచుగా గొడవలు జరగుతున్నాయి. నిన్న (మంగళవారం) ఆకాంక్ష ఉన్న ఫ్లాట్‌కి ఆమె స్నేహితులు వెళ్లగా.. ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో షాక్‌కు గురైన స్నేహితులు.. పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఆకాంక్ష ప్రియుడు అర్పిత్ సోమవారం రాత్రి ఆమె ఫ్లాటుకు వచ్చినట్లుగా తేలింది. ఆకాంక్షను అతడే గొంతునులిమి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. చంపేసిన తర్వాత ఆమెను ఫ్యానుకు ఉరేసి.. అక్కడి నుంచి పారిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న అర్పిత్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యువతి మరణ వార్తతో గోదావరఖనిలోని వారి నివాసం వద్ద విషాదం అలుముకుంది. ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది.
Rahul Gandhi Vs Dhankar: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన ఉప రాష్ట్రపతి ధన్‌కర్