Site icon NTV Telugu

Ajmer Bike Couple: బైక్‌పై జంట రాసలీలలు.. గుణపాఠం చెప్పిన పోలీసులు

Couple Bike Romance

Couple Bike Romance

Ajmer Couple Romance On Moving Bike In Viral Video Case Filed: ప్రేమ.. ఈ పదం ఎంత మధురమైనదో, ఆ బంధం కూడా అంతే అందమైనది. కానీ, ఈమధ్య కొందరు జంటలు ఆ ‘ప్రేమ’ను ‘కామమ్’గా మార్చేస్తున్నారు. సిగ్గు విడిచి నడిరోడ్డు మీద రాసలీలలు కానిచ్చేస్తున్నారు. ‘ప్రేమ’ అనే పదాన్ని అడ్డం పెట్టుకొని, అడ్డగొలుగా ప్రవర్తిస్తున్నారు. నాలుగు గోడల మధ్య చేయాల్సిన కార్యాన్ని.. బహిరంగ ప్రదేశాల్లోనే కానిచ్చేస్తున్నారు. తామేదో ఘనకార్యం చేస్తున్నంత గొప్పగా బిల్డప్పులు ఇచ్చుకుంటూ మరీ.. రాక్షసత్వం, పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. కుటుంబ గౌరవం, కనీసం తమ మర్యాద గురించి పట్టించుకోకుండా.. జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ జంట అయితే.. అత్యంత ఛెండాలంగా బైక్‌పై రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయింది. అయితే, అందుకు వారికి తగిన శాస్తి కూడా జరిగింది. పోలీసులు అరెస్ట్ చేసి, గుణపాఠం నేర్పించారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Disney Lay Offs: ఇప్పుడు డిస్నీ వంతు.. 7 వేల మంది ఉద్యోగుల తొలగింపు

రాజస్థాన్‌లోని అజ్మేర్‌లో ఆ రహదారిపై వాతావరణం అప్పటివరకు బాగానే ఉంది. కానీ, ఇంతలోనే అటుగా వెళ్లిన ఓ జంట కారణంగా అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే.. వాళ్లు సాధారణంగా వెళ్లలేదు, బైక్ మీద రాసలీలలు కానిస్తూ వెళ్తున్నారు. యువకుడు తన ప్రియురాల్ని పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చోబెట్టుకుని, ఆమెతో రొమాన్స్ చేస్తూ బైక్ నడిపాడు. ఈ దృశ్యం చూసి తోటి వాహనదారులు ఖంగుతిన్నారు. ఈ క్రమంలోనే ఒకరు వెంటనే మొబైల్ తీసి, వారి బాగోతాన్ని వీడియో తీశారు. వెంటనే సోషల్ మీడియాలో ఆ వీడియో పెట్టి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. బైక్‌పై వికృత చేష్టలకు పాల్పడ్డ ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. బైక్‌ను సీజ్‌ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా.. గతంలో వైజాగ్, లక్నో, చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లోనూ ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

Muslim Law Board: నమాజ్‌ కోసం మసీదుల్లోకి మహిళల ప్రవేశానికి అనుమతి ఉంది..

Exit mobile version