Site icon NTV Telugu

Ajit Pawar Plame crash: అజిత్ పవార్ విమానం ఎలా కుప్పకూలింది.? AAIB సంచలన నివేదిక..

Ajit Pawar

Ajit Pawar

Ajit Pawar Plame crash: మహారాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. అజిత్ పవార్ మరణించిన నెల రోజుల తర్వాత ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) తన ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. బారామతి ఎయిర్ స్ట్రిప్ వద్ద ‘‘లో-విజిబిలిటీ’’, ‘‘భద్రతా లోపాలు’’ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నివేదిక గుర్తించింది. అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమాన ప్రమాదం జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ దుర్ఘటనలో అజిత్ పవార్, ఇద్దరు పైలట్లు, అతని భద్రతా గార్డు, ఒక విమాన సహాయకురాలు కూడా మరణించారు.

Read Also: PAK vs SL: చరిత్ర సృష్టించిన పాక్ స్టార్ బ్యాటర్.. విరాట్ కోహ్లీ 12 ఏళ్ల రికార్డ్ బద్ధలు..

విమానం ల్యాండింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో గాలి పరిస్థితులు సాధారణంగా ఉన్నాయని, దృశ్యమానత దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని దర్యాప్తు నివేదిక పేర్కొంది. ప్రమాదానికి ముందు పైలట్ ‘‘ఓహ్ షిట్..ఓహ్ షిట్’’ అని అనడం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(CVR)లో రికార్డ్ అయింది. అయితే, CVR మంటల్లో దెబ్బతింది, డేటాను తిరిగి పొందడానికి తయారీదారు హనీవెల్ నుండి సాంకేతిక సహాయం కోరుతున్నారు.

సాలిడ్ స్టేట్ ఫ్లైట్ డేటా రికార్డర్ (SSFDR) నుండి డేటాను డౌన్‌లోడ్ చేసి విశ్లేషిస్తున్నారు. నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్ (NTSB) సహాయంతో తిరిగి పొందనున్నారు. కూలిపోయిన విమానాన్ని నిర్వహిస్తున్న VSR వెంచర్స్ ఉద్యోగులు, ఇతర సంబంధిత వ్యక్తుల నుండి ప్రారంభ ప్రకటనలు నమోదు చేయబడ్డాయని AAIB పేర్కొంది. విమాన భద్రతకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.

Exit mobile version