Site icon NTV Telugu

Air India: ఉద్రిక్తతల కారణంగా ఎయిరిండియాకు రూ.5 వేల కోట్ల నష్టం!

Airindia

Airindia

పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పాకిస్థాన్-భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలను నిలిపివేసింది. అనంతరం పాకిస్థాన్ వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసివేసింది. దీంతో పాకిస్థాన్.. గగనతలాన్ని మూసివేసింది. తమ వైపు విమానాలు రాకుండా అడ్డుకుంది. అయితే దీని కారణంగా ఎయిరిండియా భారీ నష్టాలను ఎదుర్కొంది.

ఇది కూడా చదవండి: Canabarro Lucas : 116 ఏళ్ల జ్ఞాపకం.. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత..

పాక్‌ గగనతలం ఏడాది పాటు మూసివేతతో ఎయిరిండియా సంస్థకు రూ.5 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లనుంది. ఈ విషయాన్ని పీటీఐ వెల్లడించింది. ఎయిరిండియా సహా ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి విమానయాన సంస్థలు తాజాగా సూచనలు, సలహాలను పౌర వైమానిక శాఖకు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిశీలించి తగిన పరిష్కారం వెతికే పనిలో ఆ శాఖ నిమగ్నమైంది.

ఇది కూడా చదవండి: AP Crime: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య..! అన్నయ్య అంటూ పరిచయం చేసి..!

ఏడాది పాటు పాక్‌ గగనతలం మూసివేస్తే సుమారు 600 మిలియన్‌ డాలర్లు (రూ.5 వేల కోట్లు) నష్టం వాటిల్లుతుందని ఎయిరిండియా పేర్కొంది. ఈ నేపథ్యంలో వైమానిక సంస్థ పలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాయి. ప్రస్తుతం దేశంలో ఎయిరిండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌, ఆకాశా ఎయిర్‌ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. వైమానిక సంస్థలకు వారానికి రూ.77 కోట్ల అదనపు భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక భారత్‌ కూడా గత బుధవారం నుంచి పాకిస్థాన్‌ విమానాలకు మే 23వ తేదీ వరకు గగనతలం మూసివేసింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Exit mobile version