Air Hostess Archana Death Mystery Revealed: శుక్రవారం అర్థరాత్రి బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో 4వ అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన ఎయిర్‌హోస్టెస్ అర్చన కేసు మిస్టరీ వీడింది. ప్రియుడు ఆదేశ్ ఆమెను కిందకు తోసేసి హత్య చేసినట్టు వెల్లడైంది. తొలుత ఈ కేసుని అతడు తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అతడు తన నేరాన్ని అంగీకరించాడు. పెళ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేయడం వల్లే తాను అర్చనని హతమార్చినట్టు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. అసలు ఏం జరిగిందంటే..
Mumbai Female Cop: ‘‘మేడమ్ క్యూట్‌గా ఉన్నావ్’’.. మహిళా పోలీస్‌ని వేధించిన ఆకతాయి
దుబాయ్‌లో స్థిరపడిన అర్చన ఒక అంతర్జాతీయ విమానయాన కంపెనీలో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేసేది. ఆమె ప్రియుడు ఆదేశ్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఒక డేటింగ్ యాప్ ద్వారా ఈ ఇద్దరికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకి ఆ పరిచయం స్నేహంగానూ, ఆ తర్వాత ప్రేమగానూ మారింది. ఆదేశ్‌ను పీకల్లోతు ప్రేమించిన అర్చన.. తమ రిలేషన్‌షిప్‌ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. అంటే.. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణమే.. కొన్ని రోజుల కిందట దుబాయ్ నుంచి బెంగళూరుకి వచ్చేసింది. వీళ్లిద్దరు కోరమంగలలోని 8వ బ్లాక్ రేణుకా రెసిడెన్సీ అపార్టుమెంట్‌లో నాలుగు రోజుల పాటు కలిసి ఉన్నారు. శుక్రవారం సినిమా చూసిన తర్వాత ఆదేశ్ ఫ్లాట్‌కి తిరిగొచ్చారు. ఇద్దరూ కలిసి మద్యం పార్టీ చేసుకున్నారు.
Boora Narsaiah: తెలంగాణలో ఢిల్లీని మించిన లిక్కర్ స్కామ్ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో..
ఈ క్రమంలోనే తనను పెళ్లి చేసుకోవాలని అర్చన కోరింది. కానీ.. ఆదేశ్ అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కట్ చేస్తే.. మద్యం మత్తులో అర్చన బిల్డింగ్ పై ననుంచి అనుకోకుండా జారిపడి, మృతి చెందిందని ఆమె తండ్రికి ఆదేశ్ ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులకు కూడా అదే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అయితే.. అర్చన తండ్రి దేవరాజ్‌కి అనుమానం వచ్చి, ప్రియుడిపై పోలసులకు ఫిర్యాదు చేశాడు. ఆదేశ్‌ని అరెస్ట్ చేసి పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. తానే చంపానని నేరం ఒప్పుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అర్చన మూడు నెలలుగా పీడిస్తోందని, 11వ తేదీన రాత్రి ఇదే విషయంపై గొడవ జరిగిందని, పెళ్లి చేసుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించిందని, దాంతో కోపాద్రిక్తుడైన తాను అర్చనని కిందకు తోసేసి చంపేశానని పేర్కొన్నాడు.
KS Bharath: కేఎస్ భరత్ వద్దు.. అతడే సరైనోడు.. టీమిండియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు