CM Vijay: తమిళనాడు సీఎం, టీవీకే పార్టీ అధినేత జోసెఫ్ విజయ్‌పై అన్నాడీఎంకే తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆ పార్టీ సీనియర్ నేత ఆర్బీ ఉదయకుమార్ మాట్లాడుతూ.. అప్పుల భారంతో బాధపడుతున్న కావేరి డెల్టా రైతుల కష్టాలు పట్టించుకోకుండా, సీఎం తన హెయిర్ స్టైల్ మార్చుకోవడంపై శ్రద్ధ పెడుతున్నారని అన్నారు. ఆయన తన హెయిర్ స్టైల్‌లో చూపిస్తున్న శ్రద్ధలో కొంతైనా రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడంపై చూపించాలని విమర్శించారు.
ఆదివారం ఉదయకుమార్ మాట్లాడుతూ.. నీటి కొరత కారణంగా పట్టలు దెబ్బతిన్నాయని, రైతులు భారీగా అప్పులపాలయ్యారని ఆయన ఆరోపించారు. కావేరి డెల్టా ప్రాంతంలో ప్రభుత్వం వెంటనే పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించాలని, కురువు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు నష్టపరిహారం, పంటల బీమా పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
మార్పు తీసుకొస్తారని విజయ్‌కు ఓటేసిన ప్రజలు ఇప్పుడు నిరాశకు గురవుతున్నారని చెప్పారు. చెన్నైలో సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి విజయ్ హాజరైన సందర్భంగా ఆయన కొత్త హెయిర్‌స్టైల్‌పై మీడియా, సోషల్ మీడియాలో జరిగిన చర్చను ఉదయకుమార్ ప్రస్తావించారు. వివాహ వేడుకల్లో విజయ్ కొత్త లుక్ చూడటానికి బాగానే ఉండొచ్చని, కానీ రైతుల బాధలు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

