NTV Telugu Site icon

Gujarat Rains: రోడ్డు మధ్యలో భారీ గొయ్యి.. సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్

Ahmedabad Road Caves

Ahmedabad Road Caves

Gujarat Rains: నిత్యం రద్దీగా ఉండే అహ్మదాబాద్‌లోని ఓ రోడ్డు ఒక్కసారిగా కుంగిపోగా వాహనదారులు బిత్తరపోయారు. నాణ్యత లేకుండా నిర్మాణం వల్ల రోడ్లు ఒక్కసారి కుంగిపోయిన ఘటనలు ఎన్నో చూశాం. అలాంటి ఘటనే అహ్మదాబాద్‌లో జరిగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోని వస్త్రాల్ ప్రాంతంలోని సురభి పార్క్ సమీపంలో కొత్తగా నిర్మించిన రహదారి ఆదివారం ప్రాంతంలో కొన్ని గంటల వర్షం తర్వాత కుంగిపోయింది. రోడ్డు కూలిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మెట్రో రైలు మార్గంలోని పిల్లర్ నంబర్ 123 సమీపంలో రోడ్డు మధ్యలో పెద్ద గుంత పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రహదారిని నెల రోజుల క్రితం నిర్మించినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే ఆ సమయంలో అటువైపు వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

DEERS Missing in Floods: వరదలకు కొట్టుకుపోతున్న జింకలు

గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వల్సాద్, నవ్సారి జిల్లాలకు వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇక్కడ వరదల కారణంగా జనజీవనం స్తంభించింది. గురువారం కురిసిన వర్షాలకు మొత్తం 11 మంది మృతి చెందగా.. శుక్రవారం నాటికి మృతుల సంఖ్య 54కి చేరింది. దాదాపు 14వేల మంది తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గుజరాత్ ప్రభుత్వం నాలుగు జాతీయ రహదారులను మూసివేసింది. మరోవైపు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వల్సాద్, డాంగ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జునాగఢ్, గిర్ సోమనాథ్, సూరత్, తాపీ, నవ్సారి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం తెల్లవారుజామున థానే జిల్లాలోని డోంబివాలి-కల్యాణ్ ప్రాంతంలో ద్విచక్రవాహనం భారీ గుంత కారణంగా కిందపడిపోయింది. 26ఏళ్ల వ్యక్తి ద్విచక్రవాహనం పైనుంచి కిందపడగా వెనుకే వచ్చిన బస్సు అతని మీది నుంచి పోయింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.