Nitin Gadkari: లివ్ ఇన్ రిలేషన్స్ తప్పు అని, ఇది సామాజిక నిబంధనలకు విరుద్ధమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. స్వలింగ వివాహాలు సామాజిక నిర్మాణ పతనానికి దారి తీస్తాయని హెచ్చరించారు. యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ పార్లమెంట్‌కు తన పర్యటన గురించి గుర్తు చేసుకున్నారు. వివాహాలు వద్దనుకుని అక్కడి ప్రజలు సహజీవనాన్ని ఎంచుకోవడం యూకేలో పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. ‘‘పెళ్లి చేసుకోకుంటే పిల్లలు ఎలా పుడతారు? అలాంటి పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది? మీరు సమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా వెళితే, దాని ప్రభావం ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?’’ అని ప్రశ్నించారు.
Read Also: Annamalai: విజయ్-త్రిష ఎయిర్‌పోర్ట్ విజువల్స్ లీక్.. దీని వెనక డీఎంకే ప్రభుత్వ ప్రమేయం..
ఆదర్శ భారతదేశంలో విడాకులను నిషేదించాల్సిన అవసరాన్ని ఆయన తిరస్కరించారు. లివ్ ఇన్ సంబంధాలు మంచివి కావని చెప్పారు. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నిరాకరించిన ఒక ఏడాది తర్వాత గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.