NTV Telugu Site icon

JK Polls: అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అఫ్జల్ గురు సోదరుడు

Afzalgurubrother

Afzalgurubrother

వచ్చే వారమే జమ్మూకాశ్మీర్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇక్కడు మూడు విడతల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న ఓటింగ్ జరుగుతోంది. ఇందుకోసం అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..

ఇదిలా ఉంటే 2011లో పార్లమెంటుపై దాడి ఘటనలో దోషి అఫ్జల్ గురు పెద్ద సోదరుడు అజాజ్ అహ్మద్ గురు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాడు. సోపోర్ నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీలోకి దిగుతున్నారు. త్వరలోనే ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలకు సెప్టెంబర్ 12వ తేదీతో గడువు ముగియనుంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా సోపోర్ నియోజకవర్గంలో పోలింగ్ జరుగనుంది. అజాజ్ అహ్మద్ గురు 2014లో పశుసంవర్ధక శాఖ నుంచి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు. ప్రస్తుతం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Committee Kurrollu: ప్రీ స్ట్రీమింగ్ సెలబ్రేషన్స్.. కొత్త ట్రెండ్ మొదలెట్టిన నిహారిక

ఎన్నికల్లో పోటీపై అజాజ్‌ స్పందించారు. అందరూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు తానెందుకు చేయకూడదని ప్రశ్నించారు. తన సోదరుడు అఫ్జల్ గురు సిద్ధాంతాలకు భిన్నమైన ఐడియాలజీ తనదని చెప్పుకొచ్చారు. తప్పుడు కేసులతో యువకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారని, పూణెలో చదువుకుంటున్న తన కుమారుడు షోయిబ్‌ను కూడా తొమ్మిది నెలల క్రితం అరెస్టు చేశారని చెప్పారు. యువకులపై తప్పుడు కేసులకు వ్యతిరేకంగా తాను పోరాటం సాగిస్తానని తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జైలులో ఇంజనీర్ రషీద్ కోసం ఆయన కుమారుడు అబ్రార్ రషీద్ ప్రచారం చేశారని, తన కోసం కుమారుడు ఎందుకు ప్రచారం చేయరాదని నిలదీశారు. షోయిబ్ ఎలాంటి తప్పూ చేయలేదని తాను నిరూపిస్తానన్నారు. 2013లో ఉరితీసిన అఫ్జల్ గురు పేరుతో తాను ఓట్లు అడగనని చెప్పారు.

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తుతో పోటీ చేస్తుండగా, పీడీపీ, బీజేపీ ఎన్నికల బరిలో ఉన్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు విడతలుగా పోలింగ్ జరుగుతున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇది కూడా చదవండి: Russia-Ukraine War: రష్యాపై ఉక్రెయిన్‌ భారీ దాడి.. 144 డ్రోన్లతో ఎటాక్