Site icon NTV Telugu

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రేసులో ఆ ముగ్గురు… ఎవ‌రికి ఛాన్స్‌…

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి మార్పు అనివార్య‌మ‌ని తేలిపోయింది.  ఈ విష‌యాన్ని య‌డ్డియూర‌ప్ప స్వ‌యంగా ప్ర‌క‌టించారు.  బీజేపీలో 75 ఏళ్లు నిండిన వారిని పద‌వుల నుంచి త‌ప్పించే సంప్ర‌దాయం ఉన్న‌ది.  ఈ సంప్ర‌దాయాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రు గౌర‌విస్తూ వ‌స్తున్నారు.  త‌న విష‌యంలో కూడా ఇదే విధ‌మైన సంప్ర‌దాయం ఉంటుంద‌ని, అందులో ఎలాంటి మార్పు లేద‌ని య‌డ్డియూర‌ప్ప విధాన‌స‌భ‌లో పేర్కొన్నారు.  ఈనెల 26 వ తేదీకి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల సంబ‌రాల త‌రువాత తాను ముఖ్య‌మంత్రి ప‌దవికి రాజీనామా చేస్తాన‌ని య‌డ్డియూర‌ప్ప పేర్కొన్నారు.  

Read: వినూత్న ఆలోచన‌: వాడేసిన మాస్క్‌ల‌తో వెడ్డింగ్ గౌన్‌…

ఎవ‌ర్ని కొత్త ముఖ్య‌మంత్రిగా నియ‌మిస్తార‌న్న‌ది పార్టీ నిర్ణ‌య‌మ‌ని య‌డ్డియూర‌ప్ప తెలిపారు.  ఇక ఇదిలా ఉంటే, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి రేసులో ముగ్గురు పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.  అందులో ప్ర‌హ్లాద్ జోషి, సీటీ ర‌వి, మంత్రి మురుగేష్ నిర్వాణీ, ముఖ్య‌మంత్రి అశ్వ‌త్థ నారాయ‌ణ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.  ప్ర‌హ్లాద్ జోషికి లేదా సీటీ ర‌వికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అప్ప‌గించాల‌ని ఆర్ఎస్ఎస్ ప‌ట్టుబ‌డుతున్న‌ది.  అయితే, క‌ర్ణాట‌క‌లో లింగాయ‌త్‌ల హ‌వా అధికంగా ఉంటుంది.  ఆ వ‌ర్గానికి చెందిన మురుగేష్ నిర్వాణీకి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కొంద‌రు ప‌ట్టుబ‌డుతున్నారు.  ప్ర‌హ్లాద్ జోషి కేంద్ర మంత్రిగా ప‌నిచేస్తుండ‌గా, సీటీ ర‌వి బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు.  

Exit mobile version