మిజోరాం రాష్ట్రంలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికన్ ఫ్లూ ధాటికి ఆ రాష్ట్రంలో దాదాపుగా 4800 పందులు మృత్యవాత పట్టాయి. మార్చి 21 వ తేదీన లంగ్‌లై జిల్లాలోని లంగ్‌సేన్ అనే గ్రామంలో మొదటగా ఈ వ్యాధి బయటపడింది. ఆ తరువాత ఈ వ్యాధి 9 జిల్లాలకు పాకింది. ఆ 9 జిల్లాల పరిధితో దాదాపుగా 91 గ్రామాలు ఉండగా, ఒక్క అయ్‌జోల్ జిల్లాలోనే 55 గ్రామాలు ఉండటం ఆంధోళన కలిగిస్తోంది. ఈ ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ కారణంగా ఇప్పటి వరకు రైతులు రూ. 19 కోట్ల రూపాయల వరకూ నష్టపోయారని పశువర్ధక శాఖ తెలియజేసింది. మిజోరాంలో తొలిసారిగా ఈ వ్యాధి బయటపడిందని, పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి పందులను దిగుమతి చేసుకోవడం వలన ఈ వ్యాధి ప్రభలినట్లు మిజోరాం అధిరకారులు పేర్కొంటున్నారు.
మిజోరాం ను వణికిస్తున్న ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ…
