NTV Telugu Site icon

Calcutta High Court: “అమ్మాయిలూ.. మీరు మీ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి”.. కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Calcutta High Court

Calcutta High Court

Calcutta High Court: పోక్సో కేసులో కలకత్తా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో అమ్మాయి, అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నట్లు తేలింది. ఈ కేసులో హైకోర్టు న్యాయమూర్తులు చిత్త రంజన్ దాస్, పార్థసారధి సేన్‌లతో కూడిన డివిజన్ బెంజ్ విచారణ జరిపింది.

ప్రేమ సంబంధం కారణంగా బాలికపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా ఉన్న యువకుడిని నిర్దోషిగా కోర్టు విడుదల చేసింది. ఈ కేసులో తీర్పు ఇస్తున్నప్పుడు కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర సమ్మతితో సెక్స్ లో పాల్గొనే కేసుల్లో పోక్సో చట్టంపై ఆందోళన వ్యక్తం చేసింది. అబ్బాయిలు, అమ్మాయిలకు పలు సూచనలు చేసింది.

Read Also: Ranga Reddy: ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు

యుక్త వయసు బాలికను తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. రెండు నిమిషాల ఆనందం కోసం లొంగిపోతే సమాజంలో ఆమె విలువను కోల్పోతోందని, ఆమె శరీరం యొక్క సమగ్రతను ఆమె హక్కును రక్షించాలని, ఆమె గౌరవాన్ని స్వీయ విలువను రక్షించాలని, ఆమె గోప్యతను రక్షించుకోవాలని సూచించింది.

అదే విధంగా యుక్త వయసులో ఉన్న అబ్బాయిలకు కూడా కొన్ని సూచనలు చేసింది. ఒక యువతి, స్త్రీ యొక్క విధును గౌరవించాలని, స్త్రీ యొక్క విలువలు, గౌరవాన్ని రక్షించేలా తీర్చిదిద్దాలని కోర్టు సూచించింది. ఇలాంటి విషయాల్లో పిల్లల తల్లిదండ్రులే మొదటి ఉపాధ్యాయులుగా ఉండాలి, మంచి-చెడుల గురించి చెప్పాలని, సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను గురించి నొక్కి చెప్పింది. మగపిల్లలకు తల్లిదండ్రులు మహిళలను ఎలా గౌరవించాలో చెప్పాలని, లైంగిక కోరికతో ప్రేరేపించబడకుండా మహిళలతో ఎలా స్నేహం చేయాలో చెప్పాలని సూచించింది.